YouTube సడన్ క్రాష్.. అర్ధాంతరంగా అవుటేజ్
ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ (YouTube) సేవలు అర్ధాంతరంగా స్తంభించిపోయాయి. ఒక్క అమెరికాలోనే 3,50,000 మందికి పైగా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఈ యాప్‌ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు యూజర్లకు Something Went Wrong అనే మెసేజ్ కనిపించింది. భారత్, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి పలు దేశాలను ప్రభావితం చేసినట్లు డౌన్ డిటెక్టర్‌లో వెల్లడించింది. ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం.. రాత్రి 7:59 నిమిషాల వరకు యూట్యూబ్ వీడియో ప్లాట్‌ఫామ్‌లో 2,40,707 ఫిర్యాదులు నమోదైనట్లు రాయిటర్స్ తెలిపింది.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కార్యకలాపాలను అనుక్షణం పర్యవేక్షిస్తుంటుంది డౌన్ డిటెక్టర్. ప్రపంచంలో ఎక్కడ, ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తినా దీనికి ఫిర్యాదులు వెల్లువెత్తుతుంటాయి. గతంలో ఎక్స్ క్రాష్ అయినప్పుడూ దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేసింది. ఇప్పుడు యూట్యూబ్ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోందని వెల్లడించింది. రియల్ టైమ్ డేటా ద్వారా డౌన్ డిటెక్టర్ ఈ గ్లోబల్ అవుటేజ్ ను పర్యవేక్షిస్తుంటుంది.

తాజాగా యూట్యూబ్ లో అర్ధాంతరంగా తలెత్తిన ఈ సాంకేతిక లోపానికి గల కారణం ఏమిటనేది ఇంకా తెలియరావట్లేదు. దీనిపై ఆల్ఫాబెట్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. యూట్యూబ్ అప్‌డేట్‌ల కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది యూజర్లు ఎదురుచూస్తున్నారు. చాలా మంది యూజర్లు సోషల్ మీడియా ద్వారా సమస్యను నివేదించారు.
ఈ గ్లోబల్ అవుటేజ్ యూట్యూబ్‌తో ఆగలేదు. గూగుల్ సెర్చ్, జీమెయిల్, గూగుల్ మీట్ వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లలోనూ వినియోగదారులు సమస్యలను నివేదించారు. డౌన్‌డిటెక్టర్ ప్రకారం ఈ సేవలపై ఫిర్యాదులు గణనీయంగా పెరిగాయి. కోట్లాదిమంది యూజర్లు లాగిన్ అవ్వలేకపోతున్నారు. కంటెంట్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. ప్లేలిస్ట్‌లలోని వీడియోలు పాక్షికంగా పనిచేయడం, ఖాళీ పేజీలు, సైడ్‌బార్ మాత్రమే లోడ్ అవ్వడం వంటివి సంభవిస్తోన్నాయి.
భారత్ లో ఈ తెల్లవారు జామున 6 గంటల సమయంలో యూట్యూబ్ సమస్యలు నమోదయ్యాయి. ఈ సమస్యకు పరిష్కారంగా పేజీని రీఫ్రెష్ చేయడం, యాప్ లేదా పరికరాన్ని రీస్టార్ట్ చేయడం, ఇంటర్నెట్ కనెక్షన్‌ను తనిఖీ చేయడం, కాష్, కుకీలను క్లియర్ చేయడం, VPNలను డిసేబుల్ చేయడం, యూట్యూబ్ యాప్‌ను అప్‌డేట్ చేయడం వంటివి సాధారణంగా సూచిస్తారు. ఈ అంతరాయానికి గల అసలు కారణంపై యూట్యూబ్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications