భారత్ పరువు తీశారు కదా రా! నడిరోడ్డుపై ఆస్ట్రేలియా మహిళ క్రికెటర్లతో పాడు పని

మధ్యప్రదేశ్ లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఐసీసీ వరల్డ్ కప్ 2025 ఆడటానికి భారత్ కు వచ్చిన ఆస్ట్రేలియా మహిళా జట్టులో ఇద్దరు ప్లేయర్లకు చేదు అనుభవం ఎదురైంది. ఓ యువకుడు వారిని వేధించాడు.. బైక్ పై వెంటాడాడు కూడా. దీనిపై టీమ్ మేనేజ్మెంట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ యువకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొద్దిసేపటి కిందటే అరెస్ట్ చేశారు.

మధ్యప్రదేశ్ ఇండోర్ లో చోటు చేసుకున్న ఘటన ఇది. తాము బస చేసిన హోటల్ నుంచి దగ్గర్లోనే ఉన్న ఓ కేఫ్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా స్థానికంగా నివసించే ఓ యువకుడు వారిని బైక్ పై వెంబడించాడు. వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. వారిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. వెంటనే ఆ మహిళా క్రికెటర్లు SOS నోటిఫికేషన్ పంపారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారికి రక్షణ కల్పించారు.

2 Australian Cricket Players Facing Misbehaviour in Indore While Attending ICC Women s World Cup

పోలీసులు వస్తోన్నారనే సమాచారం తెలిసిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు గానీ పోలీసులు వదల్లేదు. గాలింపు చర్యలు చేపట్టారు. అందుబాటులో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. నిందితుడిని గుర్తించి, అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియా విమెన్స్ టీమ్ సెక్యూరిటీ మేనేజర్ డానీ సిమ్మన్స్ ఈ విషయంపై ఎంఐజీ పోలీసులకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు, అకిల్ ఖాన్ అనే యువకుడిని అరెస్టు చేశారు.

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు రాడిసన్ బ్లూ హోటల్‌లో బస చేస్తోంది. ఖజరానా రోడ్డు ప్రాంతంలో ఉన్న కేఫ్ లో కాఫీ తాగడానికి ఇద్దరు క్రికెటర్లు కాలినడకన బయలుదేరి వెళ్లారు. కొంతదూరం వెళ్లాక అకిల్ ఖాన్ వారిని బైక్ పై వెంబడించాడు. ఓ క్రికెటర్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. శరీరంపై ఎక్కడపడితే అక్కడ తాకి పారిపోయాడు. దీనిపై క్రికెటర్లు వెంటనే తమ టీమ్ సెక్యూరిటీ మేనేజర్ డానీ సిమ్మన్స్‌కు ఈ విషయాన్ని తెలియజేశారు.

సిమ్మన్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇండోర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ హిమానీ మిశ్రా ఇద్దరు క్రీడాకారులను కలిసి వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 74 (మహిళల గౌరవానికి భంగం కలిగించే నేరపూరిత బల ప్రయోగం), సెక్షన్ 78 (వెంబడించడం) కింద ఎంఐజీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకరిని అనుచితంగా తాకి పారిపోయాడు. ఓ ప్రత్యక్ష సాక్షి నిందితుడి బైక్ నంబర్‌ను గుర్తించాడు. దాని ఆధారంగా నిందితుడిని అకిల్ ఖాన్‌ గా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+