ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!!
T20 World Cup final India Vs New Zealand: టీ20 టైటిల్ పోరు వేళ టీం ఇండియా పైన భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. కివీస్ తో టీమిండియా రేపు (ఆదివారం) అహ్మదాబాద్ లో ఫైనల్ ఆడనుంది. చివరి నిమిషం దాకా ఉత్కంఠగా సాగిన సెమీస్ లో ఇంగ్లాండ్ పైన గెలిచిన టీం ఇండియా ఫైనల్స్ లో అడుగు పెట్టింది. అయితే.. కివీస్ జట్టు అన్ని రంగాల్లో బలంగా ఉండటం తో టీం ఇండియా తుది జట్టు కూర్పు పైన కసరత్తు సాగుతోంది. అభిషేక్ శర్మ విషయంలో టీం మేనేజ్ మెంట్ ఫైనల్ డెసిషన్ ఉత్కంఠగా మారుతోంది. ఫ్యాన్స్ సైతం అభిషేక్ ను ట్రోల్ చేస్తున్నారు. కొత్త డిమాండ్లను తెర మీదకు తెస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ విజేత ఎవరో తేలటానికి ఒక్క రోజే సమయం ఉంది. బలమైన ప్రత్యర్ధి న్యూజీలాండ్ తో భారత్ విశ్వ విజేతగా నిలవటానికి కీలక పోరులో తల పడనుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టు కూర్పు పైన చర్చలు జరుగుతున్నాయి. టాస్.. పిచ్ కండీషన్లు కీలకంగా మారనున్నాయి. న్యూజిలాండ్ బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ బలంగా ఉండటంతో.. ఇందుకు అనుగుణంగా టీం ఇండియా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఈ టోర్నీలో అభిషేక్ శర్మ వరుస వైఫల్యాల పైన క్రికెట్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఎన్ని అవకాశాలు వచ్చినా అభిషేక్ తన ఆట తీరు మార్చుకోకపోవటం.. ప్రత్యర్ధి టీంలకు వరంగా మారుతోంది. ఇదే ఫ్యాన్స్ కు నచ్చటం లేదు. గంభీర్ ఎలాగో అభిషేక్ ను తప్పించడని.. అభిషేక్ స్వయంగా తప్పు కోవాలంటూ చేస్తున్న పోస్టింగ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే, ఫైనల్ కావటంతో కోచ్ - కెప్టెన్ మాత్రం ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అభిషేక్ కు మద్దతుగా సీనియర్ ప్లేయర్స్
ఫైనల్ లో అభిషేక్ ను తప్పించాలనే డిమాండ్ వేళ సీనియర్లు.. మాజీ కోచ్ లు మాత్రం భిన్నాభి ప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ కు మద్దతుగా నిలుస్తున్నారు. అభిషేక్ ఒక్క ఓవర్ వేచి చూస్తే... ఇక అతడిని ఆపటం కివీస్ కు సాధ్యం కాదని చెబుతున్నారు. న్యూజీలాండ్ పైన గతం లో అభిషేక్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ లాంటి బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడని గుర్తు చేస్తున్నారు. అదే విధంగా అభిషేక్ ను అవుట్ చేయటం కోసం కివీస్ ప్రత్యేక వ్యూహాలు సిద్దం చస్తుందనే అంశం గుర్తించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. సంజూ రాణిస్తుండటం భారత్ కు కలిసి వచ్చే అంశం. అయితే, ఫైనల్స్ వేళ భారీ ఒత్తిడి ఉంటుందని.. ఒకే ఆటగాడి పైన పూర్తిగా ఆధార పడటం సరి కాదని హెచ్చరిస్తున్నారు. అభిషేక్ ను తప్పిస్తే.. రింకు సింగ్‌ను ఆడించాలి. అతను కూడా ఫామ్‌లో లేడు. కాబట్టి అభిషేక్‌ను తప్పించడం సూచిస్తున్నారు. అభిషేక్ కుదురుకుంటే నిమిషాల్లో మ్యాచ్ మలుపు తిరుగుతుందని విశ్లేషిస్తున్నారు. దీంతో.. ఫ్యాన్స్ అంచనాలకు అనుగుణంగా అభిషేక్ ఫైనల్స్ లో అయినా రాణిస్తాడా.. లేదా అనేది ఉత్కంఠగా మారుతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications