షేక్ అవుతున్న అభిషేక్ శర్మ, క్యా గలత్ హై - సూపర్ 8లో గంభీర్ కొత్త ఫార్ములా..!!

Abhishek Sharma in T20 World cup: అభిషేక్ శర్మ. ఈ పేరు వెంటే ఫ్యాన్స్ కు పూనకాలే. ఈ విధ్వంసకర ఓపెనింగ్ బ్యాటర్ వరుసగా విఫలం అవుతున్నారు. జీరో స్టోరీ కంటిన్యూ అవుతోంది. సూపర్ 8 దశకు చేరిన సమయంలో అభిషేక్ వరుస జీరోలు జట్టుతో పాటుగా ఫ్యాన్స్ కు ఆందోళన పెంచుతున్నాయి. ఈ సమయంలోనే సునీల్ గవాస్కర్ లాంటి వారు సలహాలు అందిస్తున్నారు. కోచ్ గౌతం గంభీర్ సైతం సూపర్ 8 లో అభిషేక్ విషయంలో కొత్త ఫార్ములా తెర పైకి తెచ్చారు. దీంతో.. అభిషేక్ ప్రత్యర్థులను షేక్ చేస్తాడా.. మళ్లీ అతనే షేక్ అవుతాడా అనేది ఉత్కంఠ పెంచుతోంది.

టీ20 ప్రపంచకప్‌ 2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్ చెత్త ఫామ్‌ కొనసాగుతోంది. ఈ టోర్నీలో శర్మ ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో (యూఎస్‌ఏ, పాకిస్తాన్‌) డకౌట్లు కాగా.. నిన్న (ఫిబ్రవరి 18) పసికూన నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఖాతా తెరవలేక హ్యాట్రిక్‌ డకౌట్ల అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా అభిషేక్ శర్మ కొనసాగుతున్నాడు. ఇలాంటి టాప్ ప్లేయర్ ఐసీసీ మెగా టోర్నీలో ఆశించిన మేర రాణించడం లేదు. తన తొలి టీ20 ప్రపంచకప్ లో మూడు మ్యాచ్ లు ఆడినా అభిషేక్ ఖాతా తెరవలేకపోవడం శోచనీయం. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్‌లో జెర్సీ మార్పు చేసినా కూడా సత్ఫలితాన్ని ఇవ్వలేదు. అభిషేక్‌ తన రెగ్యులర్‌ జెర్సీ కాకుండా సిరాజ్‌ వేసుకునే 73వ నంబర్‌ జెర్సీ ధరించి బరిలోకి దిగినా పరుగుల ఖాతాను ఓపెన్ చేయలేదు.

abhishek-sharmas-woes-continue-in-the-t20-world-cup-was-dismissed-for-a-duck-for-the-third-time-i

గవాస్కర్ సలహా - గంభీర్ కొత్త ప్లాన్

ఇక, తాజా డకౌట్‌ తర్వాత అభిషేక్‌.. సంజూ శాంసన్ పేరిట ఉన్న ఓ చెత్త రికార్డును సమం చేశాడు. ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో టీ20ల్లో అత్యధిక డకౌట్లైన భారత బ్యాటర్‌గా సంజూ శాంసన్‌ (2024) సరసన చేరాడు. సంజూ, అభిషేక్‌ ఇప్పుడు తలో ఐదు డకౌట్లతో కొనసాగుతున్నారు. ఇా వరుసగా అభిషేక్ శర్మ జీరో కు అవుట్ అవ్వటం పైన మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక సూచన చేసారు. "ఆత్మవిశ్వాసమే ముఖ్యమైనది. అతడు న్యూజిలాండ్‌పై సెంచరీ చేశాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ మంచి ఫామ్ ఉందని అతి ఉత్సాహంతో ఆడకూడదు. క్రీజ్‌లో సెట్ అయిన తర్వాతే రిస్క్ తీసుకోవాలి. అభిషేక్ వద్ద ఉన్న ప్రతిభను మనం ఇప్పటికే చూశాం" అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. గౌతమ్ ఈ సమయంలో అభిషేక్ కు స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. సూపర్ 8 లో కొత్త ఫార్ములా అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఓపెనింగ్ ఇషాన్ తో చేయించి.. నాన్ స్ట్రైకర్ గా అభిషేక్ ను ఓపెనింగ్ జోడీగా దింపాలని భావిస్తున్నాడు. అయితే, పిచ్ కండీషన్ల కు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇటు ఫ్యాన్స్ మాత్రం అభిషేక్ పైన ఇంకా పూర్తి నమ్మకంతో ఉన్నారు. సూపర్ 8 లో ప్రత్యర్థులకు అభిషేక్ బ్యాట్ నుంచి చుక్కలు ఖాయమని నమ్ముతున్నారు. దీంతో... తొలి సూపర్ 8 లో దక్షిణాఫ్రికాతో అభిషేక్ ఏం చేయబోతున్నాడనేది ఇప్పుడు ఆసక్తి పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+