భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఆడాలా వద్దా?: నానా పటేకర్ తెగేసి చెప్పిన మాటిదే!

ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్(75) గురువారం ఉదయం గోవాలోని తన స్వగృహంలో తీవ్రమైన గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను వెంటనే మణిపాల్ ఆస్పత్రికి తరలించి వైద్యులు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసి బ్రతికించడానికి తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఉదయం 5.20 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన కుమారుడు మల్హర్ పటేకర్ ఈ విషాద వార్తను ధ్రువీకరించడంతో సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

IND vs WI: వైభవ్ ఔట్, సంజుకు లక్కీ ఛాన్స్! తొలి టీ20లో అసలు డ్రామా ఇదే!
IND vs WI: వైభవ్ ఔట్, సంజుకు లక్కీ ఛాన్స్! తొలి టీ20లో అసలు డ్రామా ఇదే!

నానా పటేకర్ అకాల మరణ వార్త తెలియగానే భారత్-పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై ఏడాది క్రితం ఆయన చేసిన సెన్సేషనల్ కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 2025 సెప్టెంబర్ 14న పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆసియా కప్ మ్యాచ్ గురించి ప్రస్తావిస్తూ.. పాకిస్తాన్‌తో భారత జట్టు క్రికెట్ ఆడటంపై ఆయన తన తీవ్ర వ్యతిరేకతను, అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Actor Nana Patekar Passes Away Old Remarks on India-Pakistan Cricket Viral Full Details Here

ఈ అంశంపై నానా పటేకర్ మాట్లాడుతూ.."నిజానికి నేను ఇలాంటి విషయాలపై వ్యాఖ్యానించకూడదు, కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడకూడదు. సరిహద్దుల్లో మన దేశ ప్రజలు, సైనికుల రక్తం చిందిస్తున్న వారి చేతులతో మనం క్రికెట్ ఆడటం ఎంతవరకు సమంజసం?" అని నానా పటేకర్ నేరుగా ప్రశ్నించారు.

IND vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. స్వర్ణ పతకం కైవసం!
IND vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. స్వర్ణ పతకం కైవసం!

అప్పట్లో పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ సంఘటనల తర్వాత భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ కావడంతో ఈ పోరును బహిష్కరించాలని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. ఆ సమయంలో ప్రముఖ నటుడు సునీల్ శెట్టి క్రీడాకారులకు మద్దతుగా నిలుస్తూ.. బోర్డు నిబంధనలు, ఒప్పందాలకు కట్టుబడి ఉండే ఆటగాళ్లను తప్పుపట్టలేమని, మ్యాచ్ చూడాలా వద్దా అనేది వారి వ్యక్తిగత నిర్ణయమని వ్యాఖ్యానించారు.

చిన్ననాటి నుంచి క్రికెట్ ప్రేమికుడైన నానా పటేకర్ స్వయంగా ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసేవారు.విరాట్ కోహ్లీ ఆటతీరును ఎంతగానో అభిమానించే ఆయన.. మ్యాచ్ లో విరాట్ ఔటైతే తట్టుకోలేక భోజనం కూడా మానేసేవారట. ఎంతగానో ప్రేమించే క్రికెట్ విషయంలో కూడా దేశ గౌరవానికే పెద్ద పీట వేస్తూ నానా పటేకర్ నాడు చెప్పిన మాటలు.. ఆయన మృతి చెందిన వేళ అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+