టీమిండియా మాజీ స్టార్ మెడపై కత్తి: రెండే ఆప్షన్లు..!!
Robin Uthappa: టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్ రాబిన్ ఊతప్ప చిక్కుల్లో పడ్డారు. అరెస్టును ఎదుర్కొంటోన్నారు. ఓ ఫ్రాడ్ కేసులో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ కేసులో ఆయనకు రెండే దారులు మిగిలాయి. ఒకటి- అరెస్ట్ కావడం, రెండు- లక్షల రూపాయల మేర బకాయిలను చెల్లించడం.
బెంగళూరుకు చెందిన సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌గా పనిచేస్తోన్నారు రాబిన్ ఉతప్ప. కంపెనీలో పని చేసే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సొమ్ముకు సంబంధించిన మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దీని విలువ దాదాపు 24 లక్షల రూపాయలు.

ఈ బకాయిల మొత్తాన్ని చెల్లించడానికి రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ అధికారులు ఈ 27వ తేదీ వరకు గడువు ఇచ్చారు. నిర్దేశిత గడువులోగా రాబిన్ ఊతప్ప ఈ మొత్తాన్ని గనక చెల్లించకపోతే అరెస్ట్‌ను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ మేరకు ఈ నెల 4వ తేదీన రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ సదాక్షరి గోపాల్ రెడ్డి ఆయనకు నోటీసులు జారీ చేశారు.
సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగుల జీతాల నుండి పీఎఫ్ మొత్తాన్ని కట్ చేసినప్పటికీ- దాన్ని భవిష్య నిధి ఖాతాల్లో జమ చేయలేదని తేలింది. ఇలా 23,36,602 రూపాయలు ఉద్యోగుల వేతనాల నుంచి కట్ చేశారని, ఆ మొత్తాన్ని ఇప్పటికీ చెల్లించట్లేదని సదాక్షరి గోపాల్ రెడ్డి ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ మొత్తాన్ని ఈ నెల 27వ తేదీ నాటికి ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది రాబిన్ ఊతప్పకు. లేదంటే అరెస్ట్ కావాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఉద్యోగుల ఖాతాల్లో జమ కాకపోవడం వల్ల దానికి సంబంధించిన ఆర్థిక పరమైన సమస్యలను సకాలంలో సెటిల్ చేయలేకపోయామని నోటీసుల్లో పొందుపరిచింది.
2007 టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడు రాబిన్ ఉతప్ప. భారత్ తరఫున 59 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 54 వన్డే ఇంటర్నేషనల్స్‌లో 1,183 పరుగులు చేశాడు. ఇందులో ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ సత్తా చాటాడు. కోల్‌కత నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌లకు ప్రాతినిథ్యాన్ని వహించాడు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications