IPL కావ్య vs అనన్య బ్యూటీ వార్ - ఆస్తిలో ఎవరు ఎక్కువ, ఎవరి బలం ఏంటి..!?

IPL Ananya Birla vs Kavya Maran: ఐపీఎల్ లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ప్రముఖ ప్లేయర్లతో పాటుగా ఫ్రాంచైజీ ఓనర్లు అంతకంటే ఎక్కువ క్రేజ్ సంపాదిస్తున్నారు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో కావ్య మారన్ కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కావ్య మ్యాచ్ వేళ ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటాయి. ఇప్పుడు కావ్యకు పోటీగా ఆర్సీబీ సొంతం చేసుకున్న అనన్యా బిర్లా క్రికెట్ వ్యాపారంలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు. దీంతో, ఇప్పుడు కావ్య వర్సెస్ అనన్య పోరు మొదలైంది. ఎవరి ఆస్తులు ఎంత.. ఎవరి వ్యాపారం ఏంటి..

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ కు ఐపీఎల్ లో మంచి క్రేజ్ ఉంది. కొన్నేళ్లుగా ఐపీఎల్‌ లో మోస్ట్ పాపులర్ లేడీ ఓనర్‌గా ఆమె కొనసాగుతున్నారు. వేలంలో ..గ్రౌండ్‌లో టీమ్ గెలిచిన సమయంలో ఇచ్చే చిరునవ్వుకు ఫిదా కావాల్సిందే. కాగా, తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్యా బిర్లా ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌లో చేరడం లీగ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Ananya Birla vs Kavya Maran net worth Who is richer between RCB and SRH power women

ఆదిత్య బిర్లా గ్రూప్ ఏకంగా రూ. 16,706 కోట్లతో ఈ జట్టును దక్కించుకోవడంతో అనన్య ఇప్పుడు ఆర్‌సీబీకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు.నెటిజన్లు ఆమెను 'నేషనల్ క్రష్' అని, ఆర్‌సీబీకి దొరికిన 'లక్కీ చార్మ్' అంటూ పోస్టింగ్స్ చేస్తున్నారు. ఆర్‌సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఆట కంటే కూడా అనన్య, కావ్యల మీదనే కెమెరాలు ఎక్కువగా ఫోకస్ చేశాయి. సోషల్ మీడియా వేదికగా ఇద్దరి మద్దతు దారులు తమ అనుకూల పోస్టింగ్స్ తో చెలరేగారు.

ఇక.. అనన్యా బిర్లా వ్యాపారవేత్త తో పాటుగా ఇంటర్నేషనల్ పాప్ సింగర్. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ లో చదువుకున్న ఆమె, 17 ఏళ్ల వయసులోనే 'స్వతంత్ర మైక్రోఫిన్' సంస్థను స్థాపించి సక్సెస్ అయ్యారు. సంగీత రంగంలోనూ పట్టు ఉంది. డబ్బు పరంగా చూస్తే అనన్యా బిర్లా, కావ్య మారన్ కంటే చాలా ముందున్నారు. బిర్లా కుటుంబానికి సుమారు 19.1 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉంటే, మారన్ కుటుంబానికి 2.57 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయి.

వ్యక్తిగత ఆస్తుల పరంగా చూసినా అనన్య టాప్ లో ఉన్నారు. అయితే, ఐపీఎల్ మేనేజ్మెంట్ లో మాత్రం కావ్య సీనియర్. ఇప్పుడు వీరిద్దరూ ఐపీఎల్ టీం ఓనర్లుగానే కాకుండా, సోషల్ మీడియా ఐకాన్స్‌గా మారిపోయారు. ఈ ఇద్దరి బ్యూటీ వార్ వల్ల ఐపీఎల్‌కు గ్లామర్ వ్యూయర్ షిప్ పెరుగుతోందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో.. వీరిద్దరి జట్లు ఈ సారి ఐపీఎల్ లో ఏ స్థాయిలో ఆకట్టుకుంటారు.. విజేతగా ఎవరు నిలుస్తారు అనేది ఆసక్తిని పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+