Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రిషబ్ పంత్‌ను లైవ్‌లో తిట్టిన అనుష్క శర్మ స్నేహితురాలు.."స్టుపిడ్" అంటూ దారుణంగా

మంగళవారం జరిగిన IPL మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తలపడింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. లక్నో విధించిన 228 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు టీం సునాయాసంగా ఛేదించింది. తద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 2 స్థానానికి చేరుకుంది.

ఇదిలా ఉంటే రిషబ్ పంత్‌ను అనుష్క శర్మ స్నేహితురాలు స్టుపిడ్ అని తిట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుతమైన సెంచరీతో తన పేలవమైన ఫామ్‌కు ముగింపు పలికాడు. సెంచరీ పూర్తి చేసిన తర్వాత పంత్ చేసిన సెలబ్రేషన్స్ అందర్ని ఆకట్టుకున్నాయి. 'సమ్మర్‌సాల్ట్' చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు పంత్.

Anushka Sharma s friend calls Rishabh Pant stupid

ఈ సందర్భంలో కెమెరా అనుష్క శర్మ వైపు చూపించిన సమయంలో ఆమె ఇచ్చిన హావభావాలు చర్చనీయాంశంగా మారాయి. అయితే, అనుష్క పక్కన కూర్చొన్న ఓ మహిళ అందరి దృష్టిని ఆకర్షించింది. పంత్ సమ్మర్‌సాల్ట్ వేడుక తర్వాత ఆమె "స్టుపిడ్" అని అన్నట్టు స్పష్టంగా కనిపించింది. ఇది చూసిన వారందరూ ఒక్కసారిగా షాక్‌గా గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారిది. దీంతో అనుష్క శర్మ పక్కన ఉన్న ఈ మహిళ ఎవరా అని ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్లు.

అనుష్క శర్మ పక్కన కనిపించిన ఆ మహిళ పేరు మాళవిక నాయక్. ఆమె తరచుగా RCB మ్యాచ్‌ల సమయంలో అనుష్కతో కలిసి కనిపిస్తుంటుంది.మాళవిక నాయక్ సుదీర్ఘ అనుభవం కలిగిన ఒక వ్యాపార, మార్కెటింగ్ నిపుణురాలు. ఆమెకు ఐటీ , అవుట్‌సోర్సింగ్ రంగాలలో అపార అనుభవం ఉంది. ఇంటెలినెట్ (సెర్కో) వంటి పెద్ద సంస్థలతో పనిచేశారు. ఆ తర్వాత, 55444 వంటి SMS ఆధారిత శోధన సేవలను అందించే స్టార్టప్ అయిన ఇన్నోజ్ టెక్నాలజీస్‌లో చేరారు.

మాళవికకు వ్యాపార అభివృద్ధి, అమ్మకాలు, భాగస్వామ్యాలు ,మార్కెటింగ్‌లో అపారమైన అనుభవం ఉంది. ఆమె మార్కెటింగ్‌లో MBA కూడా పూర్తి చేశారు. పెద్ద క్లయింట్‌లతో కలిసి పనిచేయడం, ఉత్పత్తి అభివృద్ధి కోసం సాంకేతిక బృందాలతో సమన్వయం చేసుకోవడం, కంపెనీల ఆదాయాన్ని పెంచడంపై ఆమె దృష్టి సారించారు. అంతేకాకుండా, చట్టపరమైన ఒప్పందాలను ఎదుర్కోవడంలో ,వ్యాపార చట్టాలను అర్థం చేసుకోవడంలో కూడా ఆమెకు మంచి పరిజ్ఞానం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+