Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గెట్ రెడీ..నేటి నుంచే: - భారత్- పాక్ మ్యాచ్ ఎప్పుడు: కీ హైలైట్స్

ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025 నేడు ఆరంభం కాబోతోంది. 28వ తేదీన ఫైనల్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. దీనికి వేదిక. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సన్నాహలకు అనుగుణంగా ఈ టోర్నమెంట్ అదే ఫార్మాట్‌లో జరుగుతుంది. ఈ ఎడిషన్‌లో ఎనిమిది జట్లు పాల్గొనబోతోన్నాయి. టైటిల్ కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, ఒమన్.. తలపడనున్నాయి. మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి.

  • ఈ టోర్నమెంట్ లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ గ్రూప్- ఏలో ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంగ్ కాంగ్ గ్రూప్ బీలో భాగం అయ్యాయి. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు సూపర్ ఫోర్స్ దశకు అర్హత సాధిస్తాయి.
Asia Cup 2025 is set to begin today
  • మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమౌతాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండేది. దీన్ని అరగంట ముందుకు జరిపింది.
  • నిజానికి ఈ ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వాలి. పాకిస్థాన్‌తో నెలకొన్న ఉద్రిక్త రాజకీయ సంబంధాల కారణంగా, రెండు దేశాలు తమ సొంత గడ్డపై ఆడకూడదని నిర్ణయించుకున్నాయి. దీంతో యూఏఈలో టోర్నమెంట్‌ను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
  • రెండు దాయాది దేశాల మధ్య తొలి మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగుతుంది. సెప్టెంబర్ 21న మరోసారి తలపడే అవకాశం ఉంది. రెండు జట్లు ఫైనల్‌కు చేరుకుంటే, అభిమానులు మెగా ఈవెంట్ ఫైనల్‌లో మూడో మ్యాచ్‌ను చూసే అవకాశం ఉంది.
  • విజేతకు 2.6 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభిస్తుంది.

గ్రూప్ దశ..

సెప్టెంబర్ 9: ఆఫ్ఘనిస్థాన్ vs హాంకాంగ్, షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి

సెప్టెంబర్ 10: ఇండియా vs యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్

సెప్టెంబర్ 11: బంగ్లాదేశ్ vs హాంకాంగ్, షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి

సెప్టెంబర్ 12: పాకిస్థాన్ vs ఒమన్, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్

సెప్టెంబర్ 13: బంగ్లాదేశ్ vs శ్రీలంక, షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి

సెప్టెంబర్ 14: ఇండియా vs పాకిస్థాన్, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్

సెప్టెంబర్ 15: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ vs ఒమన్, షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి

సెప్టెంబర్ 15: శ్రీలంక vs హాంకాంగ్, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్

సెప్టెంబర్ 16: బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్థాన్, షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి

సెప్టెంబర్ 17: పాకిస్థాన్ vs యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్

సెప్టెంబర్ 18: శ్రీలంక vs ఆఫ్ఘనిస్థాన్, షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి

సెప్టెంబర్ 19: ఇండియా vs ఒమన్, షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి

సూపర్ ఫోర్ షెడ్యూల్

సెప్టెంబర్ 20: B1 vs B2, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్

సెప్టెంబర్ 21: A1 vs A2, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్

సెప్టెంబర్ 23: A2 vs B1, షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి

సెప్టెంబర్ 24: A1 vs B2, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్

సెప్టెంబర్ 25: A2 vs B2, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్

సెప్టెంబర్ 26: A1 vs B1, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్

ఫైనల్..

సెప్టెంబర్ 28: ఫైనల్, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్

ఆసియా కప్ కు ఎంపికైన భారత జట్టులో- సూర్య కుమార్ యాదవ్ (కేప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కేప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్ దీప్ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్ ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+