చరిత్ర తిరగరాసిన పాకిస్తాన్..రెండు దశాబ్దాల నాటి పరాభవానికి ప్రతీకారం

AUS vs PAK 3rd ODI: పాకిస్తాన్ చరిత్ర తిరగరాసింది. రెండు దశాబ్దాల నాటి పరాభవానికి ప్రతీకారాన్ని తీర్చుకుంది. సుదీర్ఘ విరామానికి తెర దించింది. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా జట్టును మట్టికరిపించింది. వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాలో ఆ దేశ జట్టును ఓడించి వన్డే సిరీస్‌ గెలుచుకోవడం పాకిస్తాన్‌కు 22 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి.

పెర్త్‌లో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై విజయఢంకా మోగించింది పాకిస్తాన్. ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 26.5 ఓవర్లల్లో 140 పరుగులకు కుప్పకూలింది. ఈ ఇన్నింగ్‌లో సీన్ అబాట్ చేసిన 30 పరుగులే అత్యధికం. దీన్ని బట్టి పాక్ బౌలర్ల జోరు ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు.

AUS vs PAK Pakistan won an ODI series in Australia after 22 years with 2-1

మాథ్యూ షార్ట్- 22, జేక్ ఫ్రేజర్- మెక్‌గుర్క్- 7, ఆరోన్ హార్డీ- 12, జోష్ ఇంగ్లిస్- 7, కూపర్ కొనొలి (రిటైర్డ్ హర్ట్)- 7, మార్కస్ స్టొయినిస్- 8, గ్లెన్ మ్యాక్స్‌వెల్- 0, ఆడమ్ జంపా- 13, లాన్స్ మోరిస్- 0 పరుగులు చేశారు. షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌కు ఆస్ట్రేలియా బ్యాటర్లు దాసోహం అయ్యారు.

అఫ్రిది, నసీమ్ షా మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు. హ్యారిస్ రవూఫ్- 2, మహ్మద్ హస్నయిన్ ఒక వికెట్ తీసుకున్నారు. నిప్పులు చెరిగే బంతులను సంధించారు. ఒకప్పటి పాకిస్తాన్ బౌలింగ్ తీవ్రతను కళ్ల ముందు సాక్షాత్కరింపజేశారు. అవుట్ స్వింగ్, ఇన్ స్వింగ్, లెగ్ కట్టర్‌లతో బ్యాటర్లకు చుక్కలు చూపారు.

AUS vs PAK Pakistan won an ODI series in Australia after 22 years with 2-1

అనంతరం ఛేజింగ్‌కు దిగిన పాకిస్తాన్.. అవలీలగా ఈ స్వల్ప లక్ష్యాన్ని అందుకుంది. ఈ క్రమంలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది. 26.5 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. సయీమ్ అయూబ్- 42, అబ్దుల్లా షఫిక్- 37 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఈ రెండు వికెట్లను కూడా లాన్స్ మోరిస్ తీసుకున్నాడు.

బాబర్ ఆజమ్ 28, వికెట్ కీపర్ బ్యాటర్ కమ్ కేప్టెన్ మహ్మద్ రిజ్వాన్- 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీనితో మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది పాకిస్తాన్. తొలి వన్డేలో ఓడిపోయినప్పటికీ.. రెండు, మూడింట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించింది. 22 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై ఆ దేశ జట్టును ఓడించి వన్డే సిరీస్ గెలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+