Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కవ్వింపులు స్టార్ట్: టీమిండియాను ఎక్కిరించిన ఆసీస్ (వీడియో)

క్రికెట్‌లో అద్భుతమైన ఆటతీరుకు, దూకుడుకు, అత్యుత్తమ ప్రదర్శనకు ఆస్ట్రేలియా జట్టు ప్రసిద్ధి చెందింది. అయితే వారి విజయాల వెనుక మైదానంలో వారు ప్రయోగించే మరొక అస్త్రం ఉంది.. అదే స్లెడ్జింగ్. ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను భగ్నం చేయడానికి, వారిని మానసికంగా దెబ్బతీయడానికి ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉపయోగించే ఆయుధం స్లెడ్జింగ్. తాజాగా టీమిండియా ఆటగాళ్లను ఆసీస్ ప్లేయర్లు ఎక్కిరించారు. దీనికి సంబంధించి వీడియో వైరలవుతోంది.

ఆసియా కప్ 2025లో టీమిండియా ప్రదర్శించిన వైఖరి అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త వివాదానికి తెరతీసిన సంగతి తెలిసిందే. టోర్నమెంట్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ చేయకూడదని తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ అంశాన్ని తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్లు వ్యంగ్యంగా ప్రస్తావిస్తూ ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

Australia Cricketers Mock Team India Handshake Controversy Video Goes Viral

వివాదం వెనుక కారణం
ఆసియా కప్ 2025 గ్రూప్-దశలో పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధించిన తర్వాత, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రత్యర్థి కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాతో హ్యాండ్‌షేక్ చేయలేదు. ఆ తర్వాత జట్టులోని మిగతా ఆటగాళ్లు కూడా దీనిని అనుసరించారు. టోర్నమెంట్‌లో ఇరు జట్లు ఎదురుపడిన మూడు సందర్భాల్లోనూ ఇదే వైఖరిని కొనసాగించారు. పహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రంగా పెరగడమేనని నివేదికలు స్పష్టం చేశాయి.

భారత్ బలహీనత ఇదే: ఎగతాళి చేసిన ఆసీస్
త్వరలో ఆస్ట్రేలియాలో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా క్రికెటర్లు కామెంట్స్ చేస్తున్న ఒక వీడియోను Kayo Sports అనే సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో భారత జట్టు హ్యాండ్‌షేక్ నిరాకరణపై ఆసీస్ ఆటగాళ్లు ఎగతాళిగా మాట్లాడటం విశేషం.ఓ ఆసీస్ క్రికెటర్ మాట్లాడుతూ.. "మనందరికీ తెలుసు, భారత జట్టు మా దేశానికి వస్తోంది. అయితే మేము వారిలో ఒక కీలకమైన బలహీనతను గుర్తించాం" అని పేర్కొన్నారు."హ్యాండ్‌షేక్ అంటే వారికి అంతగా ఇష్టం లేదని మాకు తెలుసు. కాబట్టి మేము ఒక బంతి వేయకముందే వారిని మానసికంగా ఆందోళనకు గురి చేయగలం" అని మరో క్రికెటర్ పేర్కొన్నారు.

దీని తర్వాత భారత ఆటగాళ్లను కలవడానికి తాము ఎలాంటి కొత్త తరహా 'గ్రీటింగ్స్' (శుభాకాంక్షల పద్ధతులు) ప్రయత్నించవచ్చో సూచిస్తూ ఆస్ట్రేలియా పురుషులు, మహిళల జట్టుకు చెందిన క్రికెటర్లు సరదాగా స్పందించారు. ఈ వీడియో రెండు దేశాల క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియా ఏకాగ్రతను భంగం చేయడానికి ఇలాంటి వీడియో చేశారని భారత అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కమిన్స్ ఫిట్‌నెస్ పోరాటం: యాషెస్‌కు దూరం?
ఇదిలా ఉండగా.. భారత జట్టుతో కీలక పోరుకు ముందు ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన పూర్తి ఫిట్‌నెస్ సాధించడం కోసం తీవ్రంగా పోరాడుతున్నాడు. తాజాగా అతనికి నిర్వహించిన స్కాన్లలో అతడి వెన్నుగాయం ఇంకా నయం కాలేదని వెల్లడైంది. కొన్ని వారాలుగా ఆటకు దూరంగా ఉన్న 32 ఏళ్ల కమిన్స్.. నవంబర్ 21న ప్రారంభమయ్యే ప్రతిష్టాత్మక 'యాషెస్' సిరీస్‌లోని మొదటి టెస్టులో ఆడటం కష్టమని తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+