Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నక్కతోక తొక్కొచ్చాడ్రోయ్- చిచ్చరపిడుగు దొరికాడు: రసవత్తరంగా టీ20 వరల్డ్ కప్

టీ20 వరల్డ్ కప్ గడువు దగ్గరపడుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఫిబ్రవరి 7వ తేదీన తొలి మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇందుకు సన్నాహకంగా జరగనున్న వార్మప్ మ్యాచ్‌ల కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన ఇండియా-ఎ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్ ఆయుష్ బదోని కేప్టెన్ గా అపాయింట్ అయ్యాడు. ఈ జట్టులో తిలక్ వర్మకు చోటు లభించింది.

పలువురు యంగ్ క్రికెటర్లను జట్టులోకి తీసుకుని బీసీసీఐ. రియాన్ పరాగ్, రవి బిష్ణోయ్, ఖలీల్ అహ్మద్, మయాంక్ యాదవ్ వంటి అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాళ్లు కూడా జట్టులో ఉన్నారు. ఇండియా-ఎ జట్టు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో అమెరికాతో తలపడుతుంది ఇండియా- ఏ. దీని తర్వాత ఫిబ్రవరి 6న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో నమీబియాతో అనధికారిక మ్యాచ్‌లో ఆడుతుంది.

Ayush Badoni Named India A Captain and Tilak Varma included for Warm-Ups Ahead of T20 World Cup

మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ టెస్టిక్యులర్ టార్షన్ సర్జరీ అనంతరం పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి వస్తున్నాడు. ఈ మ్యాచ్‌లు టీ20 వరల్డ్ కప్‌కు ముందు తన ఫిట్‌నెస్‌, సీనియర్ జట్టులోకి పునరాగమనాన్ని నిరూపించుకోవడానికి కీలక అవకాశంగా నిలుస్తాయతనికి భుజం గాయం నుండి కోలుకున్న రియాన్ పరాగ్, తొమ్మిది నెలల విరామం తర్వాత బరిలోకి దిగుతున్న మయాంక్ యాదవ్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఖలీల్ అహ్మద్, గుర్జప్ నీత్ సింగ్ జట్టుకు ప్రధాన పేసర్లు. ఓపెనింగ్ బాధ్యతలను ప్రియాంశ్ ఆర్య, నమన్ ధీర్‌కు అప్పగించారు. బ్యాటింగ్‌లో నారాయణ్ జగదీశన్, తిలక్ వర్మ, ఆశుతోష్ శర్మ కీలక పాత్ర పోషిస్తారు. వికెట్ కీపర్ బ్యాటర్లుగా జగదీశన్‌తో పాటు ఉర్విల్ పటేల్ కూడా జట్టులో ఉన్నాడు. దాదాపుగా ఐపీఎల్ స్టార్ ప్లేయర్లను జట్టులోకి తీసుకోవడంతో టీ20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లు కూడా రసవత్తరంగా నిలుస్తాయనడంలో సందేహాలు అక్కర్లేదు.

ఇండియా-ఏ జట్టులో- ఆయుష్ బదోని (కేప్టెన్), నమన్ ధీర్, ఆశుతోష్ శర్మ, ప్రియాంశ్ ఆర్య, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, అశోక్ శర్మ, నారాయణ్ జగదీశన్, ఉర్విల్ పటేల్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్జప్ నీత్ సింగ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, విప్రజ్ నిగమ్ ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+