జాక్‌పాట్ కొట్టిన బాబర్ ఆజమ్

Pakistan squad for T20 World Cup 2024: ఐపీఎల్ 2024 ముగిబోతోంది. ఈ నెల 26వ తేదీన ఫైనల్. దీని తరువాత టీ20 వరల్డ్ కప్‌ 2024 టోర్నమెంట్‌‌ మొదలు కానుంది. సుమారు నెల రోజుల పాటు ఉర్రూతలూగించనుందీ మెగా టోర్నమెంట్. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.జూన్ 2వ తేదీన టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. 29వ తేదీ వరకు కొనసాగుతుంది. వెస్టిండీస్, అమెరికా.. సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తోన్నాయి. ఈ రెండు దేశాలు కలిపి మొత్తంగా ఏడు స్టేడియాల్లో మ్యాచ్‌లు షెడ్యూల్ కానున్నాయి.

తొలి సగం మ్యాచ్‌లు వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా అండ్ బార్బుడా, బార్బడోస్, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగోల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. మిగిలిన సగం మ్యాచ్‌లు- అమెరికాలోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్‌ స్టేడియాల్లో నిర్వహించనుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ట్రినిడాడ్, గయానాల్లో రెండు సెమీ ఫైనల్స్, బార్బడోస్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.

Babar Azam Pakisan has announced its squad for T20 World Cup 2024

ఈ సారి ఏకంగా 20 జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతోన్నాయి. భారత్ సహా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఆడబోయే జట్లను ఇప్పటికే ప్రకటించాయి కూడా. ఐపీఎల్ 2024 ఫైనల్స్ ఆడబోయే ప్లేయర్లు మినహా టీమిండియాకు ఎంపికైన మిగిలిన ప్లేయర్లు నేడు అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నారు.పాకిస్తాన్ మాత్రం చాలా ఆలస్యంగా జట్టును ప్రకటించింది. యువ రక్తానికి ప్రాధాన్యతను ఇచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. కుర్రాళ్లతో జట్టును నింపేసింది. అయిదుమంది ప్లేయర్లు టీ20 వరల్డ్ కప్ తొలిసారి ఆడబోతోన్నారు. డాషింగ్ ఓపెనర్ బాబర్ అజమ్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

అబ్రార్ అహ్మద్, ఆజమ్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, సయీమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్‌ ఆడబోతోన్న తొలి టీ20 వరల్డ్ కప్ ఇదే. వెటరన్ ప్లేయర్ హసన్ అలీకి చోటు లభించలేదు. అదే సమయంలో- గాయం కారణంగా కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటో వస్తోన్న ఫాస్ట్ బౌలర్ హ్యారిస్ రవూఫ్‌.. మళ్లీ టీమ్‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు.

టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ ఏలో ఉంది పాకిస్తాన్. భారత్, ఐర్ాండ్, కెనడా, యూఎస్ఏ కూడా ఇదే గ్రూప్‌లో ఉన్నాయి. తన తొలి మ్యాచ్‌ను జూన్ 6వ తేదీన ఆడబోతోంది పాకిస్తాన్. యూఎస్ఏను ఢీ కొట్టనుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో టీ20 ఇంటర్నేషనల్స్ ద్వైపాక్షిక సిరీస్‌ను ఆడుతోంది పాకిస్తాన్. ఈ సిరీస్ ఉన్నందు వల్లే ఐపీఎల్‌లో వేర్వేరు జట్ల తరఫున ఆడుతున్న ఇంగ్లాండ్ ప్లేయర్లందరూ తమ దేశానికి తిరిగి వెళ్లారు.

టీ20 వరల్డ్ కప్ ఆడే జట్టులో- బాబర్ ఆజమ్ (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హ్యారీస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీమ్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+