Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్ ప్లాన్ ఫిక్స్ చేసిన బీసీసీఐ- కీలక నిర్ణయం..!

14 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్ లో మెరుపులు మెరిపించి, 15 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav sooryavanshi) ఆరంభం ఏమీ అంతగొప్పలా లేకపోవడం ఫ్యాన్స్ ను నిరుత్సాహపరిచింది. ఐర్లాండ్ టూర్ లో అవకాశాలు రాలేదని బాధపడినా, ఇంగ్లాండ్ టూర్ లో ఇచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలో బుడ్డోడు విఫలమయ్యారు. దీంతో వైభవ్ ను టీమ్ నుంచి తప్పిస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ బీసీసీఐ ఆలోచన మరోలా ఉంది.

రిటైర్మెంట్ తీసుకోమన్న సెలెక్టర్..! ఆగ్రహంతో ఊగిపోయిన రోహిత్ శర్మ..!
రిటైర్మెంట్ తీసుకోమన్న సెలెక్టర్..! ఆగ్రహంతో ఊగిపోయిన రోహిత్ శర్మ..!

వైభవ్ సూర్యవంశీ టాలెంట్ ను గుర్తించి, ఇప్పుడు ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరో సచిన్ టెండూల్కర్ కావడం ఖాయమని భావిస్తోంది. ఇదే విషయం నిన్న జరిగిన బీసీసీఐ సమావేశం తర్వాత బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. వైభవ్ కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలో, సచిన్ ను ఆదర్శంగా తీసుకుని ఎలా రాణించాలో, అవకాశాలు అందిపుచ్చుకోవాలో సైకియా స్పష్టం చేశారు. బీసీసీఐ సమావేశంలో భారత క్రికెట్ భవిష్యత్ వ్యూహాలకు సంబంధించి కీలక చర్చలు జరిగిన తర్వాత బోర్డు కార్యదర్శి సైకియా వెల్లడించిన విషయాలు గమనిస్తే.. వైభవ్ కెరీర్ పై అతని కంటే బీసీసీఐ ఎంత సీరియస్ గా ఉందో అర్దమవుతోంది.

BCCI Aims to Ensure Vaibhav Sooryavanshi Builds a Long Career Like Sachin Tendulkar
రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై తేల్చేసిన బీసీసీఐ- వన్డేల్లో స్ధానంపై క్లారిటీ..!
రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై తేల్చేసిన బీసీసీఐ- వన్డేల్లో స్ధానంపై క్లారిటీ..!

వైభవ్ సూర్యవంశీతో పాటు ఇతర వర్ధమాన ఆటగాళ్లు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లాగా సుదీర్ఘమైన, విజయవంతమైన కెరీర్‌లను నిర్మించుకోవాలని బోర్డు కోరుకుంటోందని సైకియా తెలిపారు. కేవలం ఒక సిరీస్ లేదా ఒక ఏడాదికే పరిమితమయ్యే అద్భుతంగా మిగిలిపోకుండా ఉండేలా, వైభవ్ కు సరైన మార్గదర్శకత్వం, మద్దతు అందిస్తామని సైకియా తెలిపారు. సూర్యవంశీ , ఇతర యువ ఆటగాళ్లపై బోర్డు నిశితంగా దృష్టి సారిస్తోందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే తనదైన ముద్ర వేస్తున్న 15 ఏళ్ల ఆటగాడిని ప్రోత్సహిస్తున్నందుకు బోర్డు గర్వపడుతోందని వైభవ్ గురించి వ్యాఖ్యానించారు. అతను కేవలం ఒక సిరీస్ లేదా ఒక ఏడాదికే పరిమితమయ్యే అద్భుతంగా మిగిలిపోకుండా, సరైన దిశలో అడుగులు వేసేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అతని అంతర్జాతీయ కెరీర్‌లో అతను వేసే ప్రతి అడుగును, అన్ని కోణాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+