పాక్ క్రికెట్ మూలాలపై భారత్ దెబ్బ: మెగా టోర్నీకి గుడ్ బై

Asia Cup 2025: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల అమానుష దాడికి ప్రతీకారంగా భారత్.. అన్ని కోణాల్లోనూ పాకిస్తాన్ ను దెబ్బ కొడుతోంది. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపై ఆ దేశాన్ని నిర్వీర్యం చేయగలిగింది. దీని ఫలితంగా ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ వంటి సంస్థలు పాక్ కు ఆర్థిక సహకారాన్ని అందించడానికి నిరాకరిస్తోన్నాయి. ఆంక్షలు విధిస్తోన్నాయి.

ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు కన్నుమూసిన విషయం తెలిసిందే. దీని వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉందనే విషయాన్ని నిరూపించగలిగింది భారత్. ఆ దేశ భూభాగంతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు సాగించింది.

BCCI decided to pull out of the Asia Cup

దీనితో పాటు క్రికెట్ మూలాలపైనా దెబ్బ కొట్టింది భారత్. ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్ ఆడకూడదని నిర్ణయించుకుంది. ఈ మెగా టోర్నమెంట్ నుంచి వైదొలగింది. రెండు దేశాల మధ్య తాజాగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్ ప్రెస్ స్పోర్ట్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.

పాకిస్తాన్ హోమ్ శాఖ మంత్రి, ప్రస్తుత ఆసియా కప్ ఛైర్మన్ మోహసిన్ నఖ్వీ ఈ విషయాన్ని నిర్ధారించినట్లు తెలిపింది. ఆసియా కప్ నుండి బీసీసీఐ వైదొలగాలని భావిస్తోందని, తన నిర్ణయాన్ని ఏసీసీకి కూడా తెలియజేసిందని ఈ కథనం పేర్కొంది.

రెండేళ్లకోసారి జరిగే టోర్నమెంట్.. ఆసియా కప్. చివరి ఎడిషన్ 2023లో జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో జరగాల్సి ఉంది. 1984లో ఆరంభమైందీ టోర్నమెంట్. ఆసియా జట్లు మాత్రమే ఇందులో పాల్గొంటుంటాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఆడే టోర్నీ ఇది. ఆ తరువాత ఆఫ్ఘనిస్తాన్, హంగ్ కాంగ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నేపాల్.. ఇందులో చేరాయి.

2016, 2022 మినహా మిగిలిన అన్ని టోర్నమెంట్లు కూడా వన్డే ఫార్మట్ లో సాగాయి. ఈ టోర్నమెంట్ పై భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎనిమిది సార్లు ఈ టైటిల్ గెలుచుకుంది. ఆరుసార్లు శ్రీలంక, రెండుసార్లు పాకిస్తాన్ విజయం సాధించాయి. పాకిస్తాన్ కు పెద్దగా అచ్చిరాని టోర్నీల్లో ఇదీ ఒకటి.

పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో భారత్.. ఇందులో నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. పాక్ ఆడే అన్ని టోర్నమెంట్ల నుంచి కూడా తప్పుకోవాలని భావిస్తోంది. భారత్ ఇందులో నుంచి తప్పుకొంటే- స్పానర్ షిప్ భారీగా తగ్గుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+