ఆర్సీబీకి బ్యాడ్ లక్..?!

RCB vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఈ సాయంత్రం పునఃప్రారంభం కాబోతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కోల్ కత నైట్ రైడర్స్ తో తలపడబోతోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది.

భారత్- పాకిస్తాన్ మధ్య తలెత్తిన యుద్ధం, ఉద్రిక్త పరిస్థితులను ద్రష్టిలో పెట్టుకుని కిందటి వారం ఐపీఎల్ 2025 తాత్కాలికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. భారత్ పై పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లను సంధించిన నేపథ్యంలో భద్రత కారణాల వల్ల అప్పట్లో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్- ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు కూడా అయింది.

Bengaluru is expected rain during the RCB vs KKR Match in IPL 2025

ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నందున ఐపీఎల్ 2025 సీజన్ పునఃప్రారంభమైంది. ప్లేఆఫ్స్ ను దాదాపుగా ఖాయం చేసుకున్న ఆర్సీబీ.. కేకేఆర్ ను ఢీకొట్టనుంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ లల్లో ఎనిమిదింట్లో విజయఢంకా మోగించింది రాయల్ ఛాలెంజర్స్ టీమ్. మొత్తం 19 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో కొనసాగుతోంది.

కేకేఆర్ తో మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ ఖాయమైనట్టే. దీనికి భిన్నంగా ఉంటోంది కోల్ కత నైట్ రైడర్స్ పరిస్థితి. ప్లేఆఫ్స్ చేరుకోవాలంటే గెలిచి తీరాల్సిన గేమ్ ఇది. 12 మ్యాచ్ లల్లో అయిదింట్లో గెలిచింది. ఆరింట్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది. మొత్తం 11 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. ఆర్సీబీపై గెలిస్తే ప్లేఆఫ్స్ కు మరింత చేరువ అవుతుంది.

ఈ రెండు జట్లకూ కీలకంగా మారిన ఈ గేమ్.. ఊగిసలాటలో పడింది వర్షాల వల్ల. బెంగళూరులో నెలకొన్న వాతావరణ పరిస్థితుల వల్ల కొనసాగుతుందా? లేదా అనే అనుమానాలు ఏర్పడ్డాయి. నాలుగైదు రోజులుగా ప్రతి సాయంత్రం పూటా ఉద్యాననగరిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.

మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ- ఆ తరువాత ఆకాశం మేఘావ్రతమౌతోంది. వాతావారణం చల్లగా మారుతోంది. అడపాదడపా చినుకులు పడుతూనే వస్తోంది. ఈ సాయంత్రం కూడా అలాంటి వాతావరణమే ఉంది బెంగళూరులో. ఉరుములు, మెరుపులతో తేలికపాటి జల్లులూ పడటం ఆరంభమైంది కూడా.

మ్యాచ్ మొదలయ్యే సమయానికి వర్షం పడటానికి 76 శాతం అవకాశాలు ఉన్నాయని అక్యు వెదర్ తెలిపింది. రాత్రి 9 గంటల వరకు వర్షం కొనసాగడానికి 39 శాతం మేర అవకాశం ఉందని అంచనా వేసింది. శుక్రవారం రాత్రి 10 గంటల తరువాత బెంగళూరులో వర్షం పడటం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

దేశంలో ఎక్కడా లేని విధంగా చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక అండర్ గ్రౌండ్ సబ్ ఎయిర్ సిస్టమ్ ఉన్న విషయం తెలిసిందే. ఎంత వర్షం పడినప్పటికీ ఆ నీరంతా కూడా 20-25 నిమిషాల్లో బయటికి వెళ్లే వ్యవస్థ ఇక్కడ ఉంది. వర్షం పడి నిలిచిపోతే ఫర్వాలేదు గానీ కొనసాగితే ఆర్సీబీకి దురద్రుష్టం వెంటాడినట్టవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+