ఐపీఎల్ ఫైనల్స్ వేళ.. విరాట్ కోహ్లీకి షాకిచ్చిన బెంగళూరు

Virat Kohli: ఐపీఎల్ 2025.. ఫైనల్స్ ఎవరో తేలిపోయింది. క్వాలిఫయర్ 1 సీన్.. ఇక్కడ కాబోతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ ఢీ కొట్టబోతోంది. మంగళవారమే ఫైనల్ గేమ్. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.

ఆదివారం రాత్రి జరిగిన క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ విజయఢంకా మోగించింది. అయిదు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ను మట్టికరిపించింది. ఊహించినట్టే- ముంబై ఇండియన్స్ బౌలర్లు ఈ మ్యాచ్ లో ఘోరంగా విఫలం అయ్యారు. 203 పరుగుల భారీ స్కోర్ ను కాపాడుకోలేకపోయారు.

Bengaluru police registered suo-moto case against Virat Kohli s One 8 Commune restaurant

ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ ను ఢీ కొట్టడానికి రాయల్ ఛాలెంజర్స్ తయారవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జట్టు రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి షాకిచ్చారు బెంగళూరు పోలీసులు. కోహ్లీకి చెందిన వన్-8 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్ పై సుమోటో కేసు నమోదు చేశారు.

సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ (కోప్టా) కింద ఈ కేసు నమోదైంది. కోప్టా యాక్ట్ లోని సెక్షన్ 4, 21 కింద కబ్బన్ పార్క్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. రెస్టారెంట్ పరిధిలో ఎక్కడే గానీ ప్రత్యేకంగా స్మోకింగ్ జోన్ ను ఏర్పాటు చేయకపోవడం ఈ సుమోటో కేసు పెట్టడానికి కారణమైంది.

అలాగే- బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) కూడా రెస్టారెంట్ కు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కిందటి నెల డిసెంబర్ లో ఈ నోటీసులు జారీ అయ్యాయి. అగ్నిమాపక విభాగం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోకపోవడం వల్ల అప్పట్లో బీబీఎంపీ ఈ నోటీసులు ఇచ్చింది.

కర్ణాటక ప్రభుత్వం హుక్కా బార్లపై పూర్తిగా నిషేధం విధించడం, పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి చట్టబద్ధమైన వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచిన మరుసటి రోజే వన్-8 కమ్యూన్ రెస్టారెంట్ పై ఈ కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+