Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తలా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ధోనీ వీడ్కోలుపై బిగ్ అప్‌డేట్!

IPL 2026: ప్రతి ఐపీఎల్ సీజన్ ముగియగానే దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్‌పై చర్చ జరగడం సాధారణమే. అయితే ఈ సారి ఐపీఎల్ 2026 మినీ వేలం ముగిసిన వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఒక చేదువార్త వినిపిస్తోంది. ఈ సారి టీమిండియా మాజీ ఆటగాడు, సీఎస్కే మాజీ స్టార్ రాబిన్ ఉతప్ప చేసిన కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై సంచలన కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్ ధోనీకి చివరిది కాబోతుందని రాబిన్ ఉతప్ప స్పష్టం చేశాడు.

ఉతప్ప ఏమన్నారంటే?
జియో సినిమా వేదికగా రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ.."ఈసారి ఎటువంటి ఊహాగానాలకు తావు లేదు. ఐపీఎల్ 2026 కచ్చితంగా ధోనీకి చివరి సీజన్ అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సీఎస్కే మేనేజ్‌మెంట్ గత రెండేళ్లుగా యువ ఆటగాళ్లపై పెడుతున్న పెట్టుబడి చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోంది" అని పేర్కొన్నారు.

Big Update on MS Dhoni Retirement IPL 2026 Likely His Final Season Says Robin Uthappa

సీఎస్కే వ్యూహంలో మార్పు.. ధోనీకి మెంటర్ రోల్?
ఈ ఏడాది వేలంలో సీఎస్కే అనుసరించిన వ్యూహాన్ని రాబిన్ ఉతప్ప విశ్లేషించారు. సీఎస్కే ఇకపై అనుభవజ్ఞులైన ఆటగాళ్ల కంటే భవిష్యత్తు తారలపై దృష్టి సారిస్తోంది. అన్ క్యాప్డ్ ప్లేయర్లు ప్రశాంత్ వీర్ (రూ. 14.2 కోట్లు), కార్తీక్ శర్మ (రూ. 14.2 కోట్లు) కోసం రికార్డు ధర వెచ్చించడం దీనికి నిదర్శనం.
ఆటగాడిగా తప్పుకున్నాక, ధోనీ సీఎస్కే జట్టుకు మెంటర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఉతప్ప జోస్యం చెప్పారు. ఇప్పటికే ధోనీ ఆ కోణంలోనే జట్టును సిద్ధం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

వేలంలో సీఎస్కే సంచలనం
అబుదాబిలో జరిగిన మినీ వేలంలో సీఎస్కే తన పంథాను మార్చుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి సంజూ శాంసన్ ట్రేడ్ ద్వారా సీఎస్కేలోకి రావడం జట్టుకు బలంగా మారింది. లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను రూ.5.2 కోట్లకు సొంతం చేసుకుంది. మిడిలార్డర్ బలోపేతం కోసం సర్ఫరాజ్‌ను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. 44 ఏళ్ల ధోనీ ఐపీఎల్ 2025లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రిటెన్షన్ పొంది, ఇప్పుడు 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్నారు. ఉతప్ప అన్నట్లుగా ఈ 'చివరి వేడుక' తర్వాత మహీ ఆటగాడిగా మైదానానికి వీడ్కోలు పలుకుతారో లేదో చూడాలి!

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+