Chahal-Dhanashree: చాహల్, ధనశ్రీ విడాకులు.. ఫ్యామిలీ కోర్టు కీలక నిర్ణయం
Chahal-Dhanashree: క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకుల పిటిషన్‌పై తుది నిర్ణయం వెలువడింది. ఇద్దరూ చట్టబద్ధంగా విడిపోయారు. చాహల్, ధనశ్రీ కుటుంబ న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది. ఇద్దరి విడాకులకు బాంద్రా ఫ్యామిలీ కోర్టు ఆమోదం తెలిపింది. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్నారు. కానీ ఇద్దరూ జూన్ 2022 నుంచి విడివిడిగా నివసిస్తున్నారు. వారు కుటుంబ కోర్టులో పరస్పర అంగీకారంతో ఉమ్మడి విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో, వారిద్దరూ 6 నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్ నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బాంబే హైకోర్టు ఇచ్చిన కీలక నిర్ణయం ఏమిటి?
బాంబే హైకోర్టు కీలక నిర్ణయం ఇస్తూనే.. చాహల్, ధనశ్రీ విడాకులకు 6 నెలల తప్పనిసరి కూలింగ్-ఆఫ్ వ్యవధిపై మినహాయింపును నిరాకరించిన బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టు నిర్ణయాన్ని రద్దు చేసింది. విడాకుల పిటిషన్ పై తుది నిర్ణయం ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. 2022 నుంచే విడివిడిగా ఉంటున్నందున మళ్లీ ఆరు నెలల కూలింగ్ పీరియడ్ అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మార్చి 20 లోపు విడాకుల అంశంపై తుదితీర్పు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే గురువారం విడాకులను మంజూరు చేస్తూ తుది తీర్పును వెలువరించింది. ఐపీఎల్ లో చాహల్ పాల్గొనడంపై ఎలాంటి ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో అలాంటి డిమాండ్ చేయబడింది. తాజాగా బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులకు ఆమోదం తెలిపింది.

2022 నుంచి విడివిడిగా నివసిస్తున్న చాహల్, ధనశ్రీ
యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ జూన్ 2022 నుండి విడివిడిగా నివసిస్తున్నారు. ఈ జంట రెండు సంవత్సరాలకు పైగా విడివిడిగా నివసిస్తున్నారు. ధనశ్రీకి రూ.4,75 కోట్ల భరణం చెల్లించేందుకు చాహల్ ఇప్పటికే అంగీకరించాడు. ఇందులో ఇప్పటివరకు రూ.2.37 కోట్లు చెల్లించాడు. కాగా ఈ తీర్పు కోసమే యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ జట్టులో ఇంకా చేరకుండా ఉన్నాడు.
#WATCH | Mumbai: On the divorce of Cricketer Yuzvendra Chahal and Dhanashree Verma, Advocate Nitin Kumar Gupta, representing Chahal, says, "The court has granted the decree of divorce. The court has accepted the joint petition of both parties. The parties are no longer husband… pic.twitter.com/LV1BpFwxIN
— ANI (@ANI) March 20, 2025












Click it and Unblock the Notifications