చాహల్- ధనశ్రీ డివోర్స్​ పై క్లారిటీ..!.. వామ్మో భరణం ఇన్ని కోట్లా..?

టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్- ధనశ్రీ వర్మల విడాకుల గురించి ఎప్పటినుంచో చర్చ నడుస్తోంది. అయితే వీరి డివోర్స్ మ్యాటర్ దాదాపు కన్ఫార్మ్ అయినట్లే కనబడుతుంది. ఇదే విషయంపై తాజాగా బాంబే హై కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. 6 నెలల కూలింగ్ పీరియడ్​ మినహాయిస్తూ బాంబే హైకోర్టు తీర్పును వెల్లడించింది. అలాగే ఈ విడాకుల పిటిషన్‌పై మార్చి 20 అంటే రేపటిలోగా నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు ఆదేశించింది.

Chahal-Dhanashree Verma Divorce Update Here s How Much He s Paying in Alimony

అయితే చాహల్- ధనశ్రీ వర్మల డివోర్స్ వార్తలు వచ్చినప్పటి నుంచి భరణం న్యూస్ బాగా వైరల్ అయింది. రూ.60 కోట్లు భరణం కింద చాహల్ ఇస్తున్నారనే వార్తలు నెట్టింట హల్‌చల్ చేశాయి. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని ధనశ్రీ తల్లిదండ్రులు కొట్టిపడేశారు. దయచేసి ప్రైవసీ ఇవ్వాలని కోరారు.

రూ.5 కోట్లు భరణం..

అయితే తాజాగా ధన శ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ అంగీకరించినట్లు సమాచారం. ఈ మొత్తంలో చాహల్ ఇప్పటికే రూ. 2.37 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇక ఈ జంట 2020లో ప్రేమ వివాహం చేసుకుంది. 2024 నుంచి వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. వీరి డివోర్స్‌కి కారణం మాత్రం ఇంకా తెలియలేదు.

ఇక ఈ ఐపీఎల్ టోర్నమెంట్​లో చాహల్ బిజీగా ఉండనున్నాడు. ఈ సీజన్​ లో చాహల్ పంజాబ్ కింగ్స్​ ఫ్రాంచైజీకి ఆడనున్నాడు. గతేడాది జరిగిన మెగావేలంలో పంజాబ్​ రూ.18 కోట్ల భారీ ధరకు చాహల్​ ను కొనుగోలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+