Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రోహిత్ సేన రుణం తీర్చుకున్న బీసీసీఐ

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన భారత జట్టుకు బంపర్ ఆఫర్ లభించింది. కోట్ల రూపాయల మేర క్యాష్ రివార్డు అందుకోనుంది. ప్రతిష్ఠాత్మక ఈ టోర్నమెంట్‌లో చెమటోడ్చినందుకు తగిన ప్రతిఫలాన్ని దక్కించుకుంది రోహిత్ సేన. ఈ ట్రోఫీని కైవసం చేసుకున్న నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఏకంగా 58 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది.

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 9వ తేదీన జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను ఓడించింది టీమిండియా. తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఈ టోర్నమెంట్‌లో తొలుత బంగ్లాదేశ్, ఆ తరువాత పాకిస్తాన్, చివరి లీగ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించంది. మొత్తం మీద ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా చరిత్ర సృష్టించింది.

Champions Trophy

ఇదే దూకుడును సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌లోనూ కొనసాగించింది. సెమీస్‌లో సమవుజ్జీ ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది. ఫైనల్స్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను 251 పరుగులకే పరిమితం చేయగలిగారు భారత బౌలర్లు. డారిల్ మిఛెల్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్ వంటి బ్యాటర్లను తక్కువ స్కోరుకే నిలువరించగలిగారు.

బౌలర్లు కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి రాణించారా మ్యాచ్‌లో. న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని అలవోకగా కొట్టిపడేసింది టీమిండియా. 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు కేప్టెన్ రోహిత్ శర్మ. జట్టును విజయం దిశగా ముందుండి నడిపించాడు. శ్రేయాస్ అయ్యర్, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్.. తమవంతు పాత్ర పోషించారు.

పాకిస్తాన్‌పై జయకేతనాన్ని ఎగురవేయడంతో పాటు ఫైనల్స్‌లో ఆధిపత్యాన్ని ప్రదర్శించినందుకు భారత జట్టుకు క్యాష్ రివార్డ్ ప్రకటించింది బీసీసీఐ. 58 కోట్ల రూపాయల నగదు బహుమతిని అందజేయనుంది. భారత జట్టు ప్లేయర్లు, హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్, బ్యాటింగ్, కోచ్, మెడికల్ టీమ్.. ఇతర సపోర్టింగ్ స్టాఫ్‌కు ఈ మొత్తం అందుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+