Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ టీమ్‌కు మాజీ స్టార్ ప్లేయర్ అడ్వాన్స్డ్ విషెస్

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. తుదిదశకు చేరుకుంది. ఇంకొక్క రోజే బాకీ. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఫైనల్ గేమ్ మొదలవుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం దీనికి వేదిక. టైటిట్ హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగిన భారత జట్టును ఎదుర్కొనబోతోంది న్యూజిలాండ్. లీగ్ దశలో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది భారత్. దీన్నీ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.

ఈ పరిస్థితుల్లో- ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ విజేతపై తన అంచనాలను వెల్లడించాడు టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్. కొద్దిసేపటి కిందటే రాంచీలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడాడు. భారత్ గెలుపుపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశాడు. అడ్వాన్స్డ్ విషెస్ తెలియజేస్తోన్నానని చెప్పాడు.

Champions trophy 2025 final Harbhajan Singh picks India and want India to bring the cup home

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని చూస్తే భారత తుదిజట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని హర్భజన్ సింగ్ అంచనా వేశాడు. ఫైనల్స్‌లో కూడా నలుగురు స్పిన్నర్లను ఆడిస్తారని అనుకుంటోన్నట్లు చెప్పాడు. అందుకే- గెలుపుపై ధీమా ఉందని వ్యాఖ్యానించాడు. తుదిజట్టులో ఎలా మార్పులు ఉండవో.. రిజల్ట్‌లోనూ ఎలాంటి మార్పులు ఉండబోవంటూ తేల్చి చెప్పారు.

Take a Poll

ఫైనల్స్‌లో కేప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్.. ధాటిగా ఆడాల్సిన అవసరం ఉందని, ఫామ్‌లోకి రావాలని హర్భజన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ తిరుగులేని ఫామ్‌లో కొనసాగుతున్నాడని, ఇదే దూకుడు ఫైనల్స్‌లోనూ ప్రదర్శించడం ఖాయమని జోస్యం చెప్పాడీ టర్బొనేటర్. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్.. సెటిల్డ్‌గా ఆడుతున్నారని అన్నాడు.

న్యూజిలాండ్ నిలకడగా ఆడితే భారత్‌కు గట్టి పోటీ ఇవ్వగలుగుతుందని వ్యాఖ్యానించాడు హర్భజన్ సింగ్. ఆ జట్టు ఎలా ఆడుతుందనేది ముందుగా అంచనా వేయలేమని, ఏ రోజుకారోజు ఆట ఆధారంగా రాణిస్తుంటుందని పేర్కొన్నాడు. దీనికి భిన్నంగా భారత్ నిలకడగా సత్తా చాటుతోందని చెప్పాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+