తుదిజట్టు అంచనాలివే- టీమిండియాకు కలిసొచ్చేనా?
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. తుదిదశకు చేరుకుంది. ఇంకొన్ని గంటల్లో ఫైనల్స్. ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం దీనికి వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. టైటిట్ హాట్ ఫేవరెట్ భారత జట్టును ఎదుర్కొనబోతోంది న్యూజిలాండ్. లీగ్ దశలో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది భారత్. దీన్నీ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
దుబాయ్ ప్లస్ పాయింట్..
లీగ్ దశలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది భారత్. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. ఆ తరువాత పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. చివరి లీగ్‌లో బ్లాక్ క్యాప్స్‌ను ఓడించింది. ఈ మూడు మ్యాచ్‌లను ఆడింది దుబాయ్ పిచ్ మీదే. ఇప్పుడు ఫైనల్స్ కూడా అక్కడే ఆడబోతోండటం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. పిచ్ స్థితిగతులు ఎలా ఉంటాయనే విషయంపై సమగ్ర అవగాహన ఏర్పడినట్టయింది.

నలుగురు స్పిన్నర్లు..
ఫైనల్స్ ఆడే తుదిజట్టులో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకపోవచ్చు టీమిండియా. గత ఆదివారం న్యూజిలాండ్‌ను ఓడించిన జట్టుతోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. నలుగురు స్పిన్నర్లు- అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిని తుదిజట్టులో తీసుకోవచ్చు.
అర్ష్‌దీప్‌కు ఛాన్స్..
పేస్ బౌలింగ్‌ను మహ్మద్ షమీ లీడ్ చేయనున్నాడు. మరో ఎండ్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అటాకింగ్‌కు దిగడం ఖాయం. నలుగురు స్పిన్నర్లు వద్దనుకుంటే మేనేజ్‌మెంట్ బెస్ట్ ఆల్టర్నేట్.. అర్ష్‌దీప్ సింగ్. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తిలను కొనసాగించి.. కుల్‌దీప్ యాదవ్‌ను తప్పించవచ్చు.

న్యూజిలాండ్‌దే..
ఇప్పటివరకు వన్డేల్లో భారత్- న్యూజిలాండ్ మధ్య 119 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్‌దే పైచేయి. 61 మ్యాచ్‌లల్లో భారత్ గెలిచింది. 50 గేమ్‌లు కివీస్ సొంతం అయ్యాయి. ఒక్క మ్యాచ్ టై అయింది. ఏడు మ్యాచ్‌ల ఫలితం తేలలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో చెరో రెండు మ్యాచ్‌లె నెగ్గాయి. ఐసీసీ ఈవెంట్‌లల్లో కూడా సమానంగా నిలిచాయి ఈ రెండు జట్లు. చెరో ఆరు మ్యాచ్‌లను గెలిచాయి.
తుదిజట్టులో..
న్యూజిలాండ్‌తో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడే తుదిజట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఆడే అవకాశం ఉంది.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications