స్టార్కూ ఎళ్లిపాయె- ఇంకెందుకురా ఆడటము
Steve Smith: ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు గడువు సమీపిస్తోంది. ఈ నెల 19వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. మార్చి 9వ తేదీ వరకు కొనసాగుతుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దేశం పాకిస్తాన్‌ను తలపడనుంది న్యూజిలాండ్. మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
రసవత్తరంగా..
భారత్ సహా ఎనిమిది దేశాలు- పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఇందులో తలపడనున్నాయి. భారత్ ఆడబోయే మ్యాచ్‌లన్నీ కూడా తటస్థ వేదిక దుబాయ్‌లో జరుగనున్నాయి. మిగిలినవి- కరాచీ, లాహోర్, రావల్పిండిల్లో షెడ్యూల్ అయ్యాయి.

హోరాహోరీ పోరు..
గ్రూప్-ఏలో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్.. గ్రూప్ బీలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల బోర్డులు కూడా తమ జట్లను ప్రకటించాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తం 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టు ఇది. రోహిత్ శర్మ కేప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ వైస్ కేప్టెన్‌గా అపాయింట్ అయ్యారు.
ఆస్ట్రేలియాలోనూ..
భారత జట్టు మాత్రమే కాకుండా అటు ఆస్ట్రేలియాలోనూ భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆసీస్ క్యాంప్ కూడా గాయాల బారిన పడింది. కేప్టెన్ పాట్ కమ్మిన్స్ సహా కీలకమైన ముగ్గురు ప్లేయర్లు జట్టుకు దూరం అయ్యారు. ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించగా.. మిగిలిన ప్లేయర్లు గాయలబారిన పడ్డవాళ్లే.
త్రిమూర్తులు..
రెగ్యులర్ కేప్టెన్ పాట్ కమ్మిన్స్, స్టార్ పేస్ బౌలర్లు మిఛెల్ స్టార్క్, జోస్ హేజిల్‌వుడ్.. ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యారు. కమ్మిన్స్, హేజిల్‌వుడ్ ఇదివరకే జట్టు నుంచి తప్పుకోగా.. తాజాగా మిఛెల్ స్టార్క్ అదే బాట పట్టాడు. అతను ఛాంపియన్స్ ట్రోఫీ ఆడట్లేదని క్రికెట ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది.
కొత్త కేప్టెన్‌కు కత్తిమీద సామే..
ఈ పరిస్థితుల మధ్య జట్టు పగ్గాలను టాప్ ఆర్డర్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ అందుకున్నాడు. అతన్ని కేప్టెన్‌గా ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. సీనియర్లు, అపార క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న మెరికల్లాంటి ప్లేయర్లు తప్పుకొన్న నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో బలమైన జట్లపై ఆస్ట్రేలియా ఎలా ఆడుతుందో వేచి చూడాలి.
కూడికలు తీసివేతలు పోగా..
మార్పులు చేర్పుల తరువాత ఆస్ట్రేలియా జట్టులో- స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), బెన్ డ్వార్‌షుయిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపాకు చోటు దక్కింది. ట్రావెలింగ్ రిజర్వ్‌గా కూపర్ కొన్నోలీ ఉన్నాడు.












Click it and Unblock the Notifications