మా పెళ్లికి రండి: సీఎం రేవంత్ రెడ్డికి పీవీ సింధు ఆహ్వానం
ఒలింపిక్ పతక విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu) త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 22న వెంకట దత్త సాయిని ఆమె వివాహం చేసుకోనుంది. ఈ నేపథ్యంలో శనివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పీవీ సింధు తన కుటుంబసభ్యులతోపాటు కలిశారు. తమ పెళ్లికి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని పీవీ సింధు ఆహ్వానించారు.
అంతకుముందు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తదితర ప్రముఖులను కలిసి తమ వివాహానికి రావాలని పీవీ సింధు తన కాబోయే భర్తతో కలిసి ఆహ్వానించారు.

కాగా, శనివారంనాడు సింధు, వెంకటసాయిల నిశ్చితార్థం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సింధు తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. 'ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు.. మనం కూడా ప్రేమించాలి. ఎందుకంటే ప్రేమ తనంతట తానుగా ఏమీ ఇవ్వదు' అనే లెబనీస్ రచయిత ఖలీల్ జిబ్రాన్ కోట్‌ను క్యాప్షన్‌గా జత చేసింది.
హైదరాబాద్‌కు చెందిన వెంకటసాయి.. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. డిసెంబర్ 22న దత్తసాయితో పీవీ సింధు వివాహం జరగనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో వీరి పెళ్లి జరుగుతుంది. డిసెంబర్ 20 నుంచి సింధు పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇక, డిసెంబర్ 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు.
తమ రెండు కుటుంబాలకు చాలా కాలం నుంచి పరిచయం ఉందని.. కానీ, నెల కిందటే పెళ్లి ఖాయం చేసుకున్నామని పీవీ సింధు తండ్రి పీవీ రమణ మీడియాకు తెలిపారు. డిసెంబర్ 22న పెళ్లి వేడుకకు ముహూర్తం నిర్ణయించామని, 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జనవరి నుంచి సింధు వరుసగా టోర్నీలు ఆడుతోందని.. అందుకే డిసెంబర్ 22న పెళ్లి వేడుకకు ముహూర్తం నిర్ణయించినట్లు తెలిపారు.
-
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !!












Click it and Unblock the Notifications