ఒకప్పుడు స్టార్ ఆల్ రౌండర్.. కట్ చేస్తే డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ
ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అంటే ఇదేనేమో. ఒకప్పుడు క్రికెట్‌లో స్టార్ ఆల్‌రౌండర్‌గా ఓ వెలుగు వెలిగిన క్రికెటర్ , ఇప్పుడు స్మగ్లర్‌గా మారి పోలీసుల చేతికి చిక్కి అరెస్ట్ అయ్యాడు. ఆ క్రికెటర్ మరెవరో కాదు క్రిస్ లూయిస్.ఇంగ్లాండ్ క్రికెట్‌లో క్రిస్ లూయిస్ ఆల్ రౌండర్‌గా ఓ వెలుగు వెలిగాడు.అతను 1968 ఫిబ్రవరి 14న గయానాలోని జార్జ్‌టౌన్‌లో జన్మించాడు. క్రిస్ లూయిస్ 1990 నుండి 1998 వరకు ఇంగ్లాండ్ తరపున 32 టెస్టులు, 53 వన్డేలు ఆడాడు.
అతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్.విచిత్రం ఏమిటంటే క్రిస్ లూయిస్ తన తొలి సెంచరీ ఇండియాపైనే సాధించాడు.1993లో భారతదేశ పర్యటనలో చెన్నై టెస్టులో ఇంగ్లాండ్ తరపున అతను తన తొలి సెంచరీ సాధించాడు. అయితే ఆ మ్యాచ్‌లో టీమిండియానే విజయం సాధించింది. కానీ లూయిస్ చేసిన సెంచరీ గురించే ఎక్కువ చర్చ జరిగింది. అంతలా అతను బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు.అతను తన కెరీర్‌లో అనేక విజయాలు సాధించాడు. ముఖ్యంగా 1990ల్లో స్టార్ ఆల్ రౌండర్‌గా క్రిస్ లూయిస్ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.

అయితే క్రమశిక్షణా రాహిత్యం కారణంగా అతని కెరీర్ ముగిసింది. సహచరులతో దురుసుగా ప్రవర్తించడం, ప్రాక్టీస్ సెషన్లకు ఆలస్యంగా రావడం, నియమాలు పాటించకపోవడం వంటి కార్యక్రమాలతో జట్టుకు తలనొప్పిగా మారాడు.దీంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతను జట్టులో స్థానం కోల్పోయాడు. క్రికెట్‌లో తన స్థానాన్ని కోల్పోయిన తర్వాత క్రిస్ లూయిస్ చేడు మార్గాలను ఎంచుకున్నాడు.
డబ్బు కోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. డ్రగ్స్ స్మగ్లింగ్‌లోకి అడుగు పెట్టాడు. 2008లో, రూ.1.5 కోట్లు విలువైన ద్రవరూప కొకైన్‌ను అక్రమంగా తరలిస్తూ లండన్ పోలీసులకు పట్టుబడ్డాడు.దీంతో 13 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. ఒక వేళ అతడు క్రమశిక్షణగా ఉన్నట్లయితే, ఇంగ్లాండ్‌కు మరొక గొప్ప ఆల్‌రౌండర్‌గా నిలిచేవాడేమో అనిపిస్తోంది. స్ లూయిస్ జీవితం క్రికెటర్లకు మాత్రమే కాకుండా అందరికీ ఒక గుణపాఠం. అతను తన ప్రతిభను వృధా చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications