అవి వరల్డ్ కప్‌ను గెలిచే మొఖాలేనా..: రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ఫైర్

చెన్నై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో మరో సంచలనం. మొన్నటికి మొన్న ప్రస్తుత ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది ఆఫ్ఘనిస్తాన్. ఏకంగా 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అదే దూకుడును కంటిన్యూ చేస్తోందా జట్టు. ఆఫ్ఘనిస్తాన్ ప్రతాపానికి
ఈ సారి పాకిస్తాన్ బలి అయింది.

చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది ఆఫ్ఘనిస్తాన్. ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్ పెట్టిన 282 పరుగుల టార్గెట్‌ను రెండంటే రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి కొట్టిపడేసింది ఆఫ్ఘన్.

CWC 2023, PAK vs AFG: Shoaib Akhtar made key remarks over Pakistans defeat

పాకిస్తాన్ జట్టు భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది. ఓపెనర్ అబ్దుల్లా షఫిక్- 58, కేప్టెన్ బాబర్ ఆజమ్- 74, షాదబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్ 40 చొప్పున పరుగులు చేశారు. బ్యాటర్లు రాణించినప్పటికీ.. బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. 49 ఓవర్లల్లో ఇద్దరిని మాత్రమే పెవిలియన్ పంపించగలిగారు. షహీన్ షా అఫ్రిది, హసన్ అలీ మాత్రమే ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్- 87, రహ్మతుల్లా గుర్బాజ్- 65 పరుగులతో తొలి వికెట్ నష్టానికి 130 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పుడే మ్యాచ్ వారి వశం అయింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు రహ్మత్ షా- 77, కేప్టెన్ హష్మతుల్లా షహీదీ- 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ చవి చూసిన మూడో ఓటమి ఇది. వరుసగా మూడింట్లో ఓడిందా జట్టు.

CWC 2023, PAK vs AFG: Shoaib Akhtar made key remarks over Pakistans defeat

ఈ ఓటమి అనంతరం పాకిస్తాన్ జట్టుపై ముప్పేట దాడి మొదలైంది. పాక్ మాజీ క్రికెటర్లు నిప్పులు చెరుగుతున్నారు. ఘాటు విమర్శలు చేస్తోన్నారు. ఈ రెండు జట్లు ఆడిన విధానాన్ని కంపేర్ చేస్తోన్నారు. గెలవాలనే తపన పాకిస్తాన్‌లో ఏ మాత్రం లేదని, అందుకే ఇంత నాసిరకంగా ఆడారంటూ మండిపడుతున్నారు.

ఈ ఓటమిపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ స్పందించారు. జట్టు ఓటమిని తాను జీర్ణించుకోలేకపోతున్నానని, ఈ స్థాయిలో పరువు పోతుందని తాను ఊహించలేదని వ్యాఖ్యానించారు. ఐసీసీ ప్రపంచకప్ వంటి అతిపెద్ద టోర్నమెంట్లల్లో ఆడే ఆట ఇది కాదని తేల్చి చెప్పారు.

గెలవడానికే నానా తంటాలు పడుతున్న జట్టు ప్లేయర్ల.. ఇక యంగ్ క్రికెటర్లకు ఎలా స్ఫూర్తినివ్వగలరని ప్రశ్నించారు. యువతను క్రికెట్ వైపు ఆకర్షితులను చేసే సామర్థ్యం ఉన్న ఆటగాడు తమ దేశ జట్టులో ఒక్కడూ లేడని, ఇది అవమానకరంగా భావిస్తోన్నానని వ్యాఖ్యానించారు షోయబ్ అఖ్తర్. ఈ ఓటమి పట్ల ఎలా స్పందించాలో కూడా తనకు తెలియట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడీ రావల్పిండి ఎక్స్‌ప్రెస్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+