రోజూ ఏడెనిమిది కిలోల మటన్ మెక్కితే.. రిజల్ట్ ఇట్లే ఉంటది: వసీం అక్రమ్
చెన్నై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో మరో సంచలనం. మొన్నటికి మొన్న ప్రస్తుత ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది ఆఫ్ఘనిస్తాన్. ఏకంగా 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అదే దూకుడును కంటిన్యూ చేస్తోందా జట్టు. ఆఫ్ఘనిస్తాన్ ప్రతాపానికి
ఈ సారి పాకిస్తాన్ బలి అయింది.
చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది ఆఫ్ఘనిస్తాన్. ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్ పెట్టిన 282 పరుగుల టార్గెట్‌ను రెండంటే రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి కొట్టిపడేసింది ఆఫ్ఘన్.

పాకిస్తాన్ జట్టు భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది. ఓపెనర్ అబ్దుల్లా షఫిక్- 58, కేప్టెన్ బాబర్ ఆజమ్- 74, షాదబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్ 40 చొప్పున పరుగులు చేశారు. బ్యాటర్లు రాణించినప్పటికీ.. బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. 49 ఓవర్లల్లో ఇద్దరిని మాత్రమే పెవిలియన్ పంపించగలిగారు. షహీన్ షా అఫ్రిది, హసన్ అలీ మాత్రమే ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్- 87, రహ్మతుల్లా గుర్బాజ్- 65 పరుగులతో తొలి వికెట్ నష్టానికి 130 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పుడే మ్యాచ్ వారి వశం అయింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు రహ్మత్ షా- 77, కేప్టెన్ హష్మతుల్లా షహీదీ- 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ చవి చూసిన మూడో ఓటమి ఇది. వరుసగా మూడింట్లో ఓడిందా జట్టు.
ఈ ఓటమి అనంతరం పాకిస్తాన్ జట్టుపై ముప్పేట దాడి మొదలైంది. పాక్ మాజీ క్రికెటర్లు నిప్పులు చెరుగుతున్నారు. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ స్పందించారు. ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ ఓటమి పట్ల ఎలా స్పందించాలో కూడా తనకు తెలియట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
Wasim Akram slamming Lumber 1 Pakistan Cricket Team for their fitness level.
— The Right Wing Guy (@T_R_W_G) October 23, 2023
This is fun to watch 😂😂😂#PAKvsAFG #AfghanAtalan #Babar #CWC2023#irfanpathan #RashidKhan
Chepauk | Protein | Haris Rauf | Shaheen Shah Afridi | Gurbaz | Zimbabwe | Lumber 1 | Ajay Jadeja | Ramiz… pic.twitter.com/vOHUSJjU7E
తాజాగా మాజీ కేప్టెన్ వసీం అక్రమ్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. 282 పరుగుల కోసం బ్యాటర్లు కష్టపడ్డాల్సి వచ్చిందంటే అది వారి వైఫల్యమేనని అన్నారు. ఆ స్కోర్‌ను కాపాడుకోవడంలో ఘోరంగా విఫలం అయ్యారని విమర్శించారు. ఆఫ్ఘనిస్తాన్‌ను కట్టడి చేయడంలో చేతులెత్తేశారని ధ్వజమెత్తారు.
బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలు అత్యంత నాసిరకంగా ఉన్నాయని వసీం అక్రమ్ ధ్వజమెత్తారు. సరైన దిశలో బౌలర్లు బంతులను సంధించలేకపోయారని, పక్కా ప్లానింగ్ లేకపోవడమే దీనికి కారణమని అన్నారు. ఫీల్డింగ్ గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువని చెప్పారు.
బంతులను ఆపడంలో అలసత్వాన్ని ప్రదర్శించినట్లు కనిపించిందని వసీం అక్రమ్ అన్నారు. ప్లేయర్ల ఫిట్‌నెస్ అధ్వాన్నంగా ఉందని విమర్శించారు. వారి ఫిట్‌నెస్ లెవెల్స్ చూస్తోంటే రోజూ ఏడెనిమిది కిలోల నిహరి తింటున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. దేశం కోసం ఆడాలనే తపన ఎవ్వరిలోనూ లేదంటూ ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications