కోమాలో మాజీ స్టార్ క్రికెటర్: అత్యంత విషమంగా...

ఆస్ట్రేలియాకు చెందిన మాజీ స్టార్ బ్యాటర్ డామియన్ మార్టిన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కోమాలోకి వెళ్లిపోయారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. క్వీన్స్‌ల్యాండ్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. 54 ఏళ్ల ఈ మాజీ బ్యాటర్ మెనింజైటిస్‌తో బాధపడుతున్నారు. దీనివల్ల మెదడు, వెన్నెముక చుట్టూ వాపు, ఇన్‌ఫెక్షన్ సోకాయి.

డేమియన్ మార్టిన్ కోమాలోకి వెళ్లిన విషయాన్ని ఆయన కుటుంబం తరఫున.. మాజీ సహచరుడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ ధృవీకరించారు. క్వీన్స్‌ల్యాండ్ గోల్డ్ కోస్ట్‌ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడని తెలిపారు. డాక్టర్లు ఆయనకు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. మార్టిన్ త్వరగా కోలుకోవాలని అనేక మంది తమ ప్రార్థిస్తోన్నారని, అమండా, ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉన్నామనే ధైర్యం ఇస్తోన్నారని వివరించారు.

Damien Martyn in Induced Coma as He Battles Meningitis in Queensland Hospital

మార్టిన్‌ త్వరగా కోలుకోవాలని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్‌బర్గ్‌ ఆకాంక్షించారు. డామియన్ అరోగ్యం విషమించిందనే వార్త తనను కలచివేసిందని అన్నారు. ఆస్ట్రేలియాలో ప్రతి ఒక్కరూ ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటోన్నారని చెప్పారు. మార్టిన్‌కు త్వరగా కోలుకోవాలని మార్టిన్ సహచర క్రికెటర్లు డారెన్ లీమాన్, ఇంగ్లాండ్ మాజీ కేప్టెన్ మైఖేల్ వాఘన్ ఆకాంక్షించారు. సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టారు.

డామియన్ మార్టిన్ 1992లో బ్రిస్బేన్‌లోనే వెస్టిండీస్‌తో టెస్ట్ అరంగేట్రం చేశారు. ఆ మ్యాచ్‌లో 36, 15 పరుగులు సాధించారు. 90వ దశకంలోనే స్టైలిష్ బ్యాటింగ్‌కు కేరాఫ్ గా నిలిచాడీ కుడిచేతి వాటం బ్యాటర్. ఆస్ట్రేలియా తరఫున 67 టెస్టులు, 208 వన్డే మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించారు. ఆస్ట్రేలియా క్రికెట్ ఆధిపత్యాన్ని చలాయిస్తోన్న సమయంలో మిడిలార్డర్ బ్యాటింగ్ కు వెన్నెముకగా నిలిచాడు మార్టిన్. ఆయన 1999, 2003 ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు కూడా.

2003 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్‌పై మార్టిన్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. అజేయంగా 88 పరుగులు చేశాడు. కేప్టెన్ రికీ పాంటింగ్ తో కలిసి 234 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీనితో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 359/2 భారీ స్కోరు సాధించిందా మ్యాచ్ లో. 2006 ఛాంపియన్స్ ట్రోఫీలో మార్టిన్ ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు (241 పరుగులు, సగటు 80.33, 2 అర్ధ సెంచరీలు) సాధించాడు.

భారత్‌లో ఆస్ట్రేలియా 2-1 టెస్ట్ సిరీస్ గెలుపొందడంలో 444 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. ఆ సిరీస్‌లోనూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మార్టిన్ తన టెస్ట్ కెరీర్‌లో 67 మ్యాచ్‌లలో 4,406 పరుగులుచేశారు. ఇందులో 13 సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డే క్రికెట్‌లో 5,346 పరుగులు నమోదు చేశాడు. ఇందులో అయిదు సెంచరీలు, 37 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 4 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 120 పరుగులు చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+