భలే ఛాన్స్ కొట్టిన ఢిల్లీ కేపిటల్స్ స్టార్ బ్యాటర్?
David Warner: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. క్రికెట్ నుంచి తప్పుకొంటోన్నట్లు ప్రకటించాడు. 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అందుబాటులో ఉంటానని తెలిపాడు. తన అవసరం ఉందనుకుంటే ఈ టోర్నమెంట్‌లో ఆడతానని పేర్కొన్నాడు.
ఐసీసీ వరల్డ్ కప్ 2023 కప్‌ను గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు డేవిడ్ వార్నర్. జట్టు తరఫున అత్యధిక స్కోర్ సాధించిన ప్లేయర్ అతనే. ఈ టోర్నమెంట్‌లో 510 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి. వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో 500లకు పైగా పరుగులు చేసిన మూడో ఆస్ట్రేలియన్ బ్యాటర్.. డేవిడ్ వార్నర్.

ఇదివరకే వన్డే ఇంటర్నేషనల్స్, టెస్ట్ ఫార్మట్ నుంచి వార్నర్ తప్పుకొన్న విషయం తెలిసిందే. తాజాగా టీ20 ఇంటర్నేషనల్స్‌కూ గుడ్ బై చెప్పాడు. రిటైర్మెంట్ తరువాత జీవితాన్ని కుటుంబం కోసం కేటాయిస్తానని డేవిడ్ వార్నర్ చెప్పాడు. కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని కేటాయించాల్సిన అవసరం వచ్చిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించాడు.
టీ20 ఫార్మట్‌లో ఇంకొంతకాలం కొనసాగాలని వార్నర్ భావించినప్పటికీ- అది సాధ్యపడలేదు. టీ20 వరల్డ్ కప్ 2024లో సూపర్ 8 దశలోనే ఆస్ట్రేలియా వెనుదిరిగిన ప్రభావం అతనిపై పడినట్టు కనిపించింది. ఆఫ్ఘనిస్తాన్, భారత్ చేతిలో బ్యాక్ అండ్ బ్యాక్ మ్యాచ్‌లల్లో ఓటమి పాలు కావడం వార్నర్‌ను తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునేలా చేసింది.
ఈ టోర్నమెంట్‌లో అతను ఆశించిన స్థాయిలో ఆడలేదు. 50 ఓవర్ల ఫార్మట్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం అందుబాటులో ఉంటానని చెప్పాడు వార్నర్. తన అవసరం ఉందని ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డ్ భావిస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే జట్టులో తనకు స్థానం కల్పించుకోవచ్చని కోరాడు.
తాజాగా డేవిడ్ వార్నర్ తన వారసుడిని ప్రకటించాడు. ఓపెనర్‌గా తాను ఖాళీ చేసిన స్థానంలో జాక్ ఫ్రేజర్ మెక్- గుర్క్‌ను తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. సుదీర్ఘకాలం పాటు క్రికెట్ ఆడగల సత్తా అతనికి ఉందని, ఓపెనర్‌గా కొత్త బంతిని ఎదుర్కొనగల సామర్థ్యం అతని సొంతమని వ్యాఖ్యానించాడు. దీనిపై తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేశాడు వార్నర్.
ఐపీఎల్ ద్వారా మనదేశానికీ పరిచయం అయ్యాడు మెక్ గుర్క్. ఈ సీజన్‌లో అతను ఢిల్లీ కేపిటల్స్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. ఇదే అతనికి తొలి ఐపీఎల్. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లల్లో 330 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని వ్యక్తిగత అత్యధిక స్కోర్ 84. ఏకంగా 234.04 స్ట్రైక్ రేట్‌తో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు మెక్ గుర్క్.












Click it and Unblock the Notifications