థ్యాంక్యూ జిమ్మీ- వికెట్ల శిఖరం: చివరి టెస్ట్‌లోనూ బౌలింగ్ పదును
James Anderson: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో ఆరంభమైన మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్.. శుభారంభం చేసింది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఘన విజయాన్ని అందుకుంది. ఇన్నింగ్, 114 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను మట్టికరిపించింది. 1-0 తేడాతో ఆధిక్యతను సాధించింది. స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌కు ఇది ఫేర్ వెల్ టెస్ట్ మ్యాచ్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్‌లో 121 పరుగులకే కుప్పకూలింది. మికైలె లూయిస్- 27, అలిక్ అథనజె- 23, కెవామ్ హోగ్డె- 24, అల్జారీ జోసెఫ్- 17 మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్ గస్ అట్కిన్సన్ దెబ్బకు విండీస్ బ్యాటింగ్ కకావికలమైంది. ఏడు వికెట్లతో నడ్డి విరిచాడు అట్కిన్సన్. జేమ్స్ అండర్సన్-, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్. ఒక్కో వికెట్ తీసుకున్నారు.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్‌లో సత్తా చాటింది. 371 పరుగులు సాధించింది. ఓపెనర్ జాక్ క్రాలీ- 76, ఒల్లె పోప్- 57, జో రూట్- 68, హ్యారీ బ్రూక్- 50, జేమీ స్మిత్- 70 పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లల్లో జేడెన్ సీల్స్ నాలుగు వికెట్లను నేలకూల్చాడు. జేసన్ హోల్డర్-, గుడకేష్ మోటీ రెండు చొప్పున వికెట్లు తీసుకున్నారు.
రెండో ఇన్నింగ్‌లోనూ వెస్టిండీస్ తేలిపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లను ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయింది. చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్‌కు ఏ మాత్రం తీసిపోనివిధంగా నాసిరకంగా ఆటతీరును ప్రదర్శించింది. 136 పరుగులకే ఆలౌట్ అయింది. లోయర్ ఆర్డర్‌లో గుడకేష్ మోటీ ఒక్కడే 31 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్‌లో అతనే టాప్ స్కోరర్.
ఈ ఇన్నింగ్‌లో కూడా గస్ అట్కిన్సన్‌కు ఎదురులేకపోయింది. అయిదు వికెట్లతో రెచ్చిపోయాడీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. తొలి ఇన్నింగ్‌లో ఏడు, రెండో ఇన్నింగ్‌లో అయిదు వికెట్లను తీసుకున్నాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌కు విండీస్ బ్యాటర్ల వద్ద సమాధానమే లేదు. అతని కేరీర్‌లో ఇదే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్.

తన చిట్టచివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ రెండో ఇన్నింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. తన ఫేర్ వెల్ మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్ పదును తగ్గలేదని నిరూపించుకున్నాడు. టెస్టుల్లో జిమ్మీ తీసుకున్న మొత్తం వికెట్ల సంఖ్య.. 704.
టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లల్లో మూడో బౌలర్ జేమ్స్ అండర్సన్. ఈ జాబితాలో శ్రీలంక మాజీ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను తీసుకున్న టెస్ట్ వికెట్లు 800. ఆస్ట్రేలియాకు చెందిన షేర్ వార్న్ రెండో స్థానం. 708 వికెట్లను పడగొట్టాడు వార్న్. ఆ తరువాతి స్థానం జిమ్మీదే. మరెవరూ కూడా అతని దరిదాపుల్లో లేరు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications