బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ
జస్‌ప్రీత్ బుమ్రా, జోష్ హాజెల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ ఎవరైనా తనకు ఒక్కటేనని రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్, సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీ అన్నాడు. తాను బౌలర్‌ను కాకుండా బంతిని చూసి ఆడుతానని మరోసారి స్పష్టం చేశాడు. దాంతోనే ఎంత పెద్ద బౌలర్‌ను అయినా అలవోకగా ఆడగలుగుతున్నానని చెప్పాడు. బంతి తన జోన్‌లో ఉంటే బౌండరీ తరలిస్తానని స్పష్టం చేశాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది. వైభవ్ సూర్యవంశీ(26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 78) విధ్వంసకర బ్యాటింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్‌సీబీ స్టార్ పేసర్లు అయిన జోష్ హజెల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌ను చితక్కొట్టాడు. పవర్ ప్లేలోనే మ్యాచ్‌ను ఆర్‌సీబీ నుంచి లాగేసుకున్నాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

బంతిని చూసి బాదడమే..
ఈ సందర్బంగా మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ.. తన ఫియర్‌లెస్ బ్యాటింగ్ వెనుక ఉన్న రహస్యాన్ని తెలియజేశాడు. 'ఈ రాత్రికి కూడా కేక్ కట్ చేయడం లేదు. రేపు ఉదయమే మాకు ఫ్లైట్ ఉంది. త్వరగా బయలుదేరాలి కాబట్టి త్వరగా పడుకోవాలి. నేను ప్రాక్టీస్‌లో ఏమి చేస్తానో.. మైదానంలో కూడా అలానే ఆడేందుకు ప్రయత్నిస్తాను. ఎక్స్‌ట్రా ఏది చేయాలని అనుకోను.
కేవలం నా సహజసిద్ధమైన ఆటనే ఆడుతాను. బౌలింగ్ చేస్తోంది ఎవరు అనేది మనసులో వెంటాడుతుంది. కానీ నేను బౌలర్‌ను చూడకుండా కేవలం బాల్‌ను మాత్రమే చూసి ఆడేందుకు ప్రయత్నిస్తాను. అందుకే ఎంత పెద్ద బౌలర్ అయినా నేను భయపడను.
రోహిత్ సర్.. నా మెంటార్..
నా మెంటార్స్‌లో మా నాన్నగారు ఒకరు. అలాగే నా కోచ్‌లు కూడా. ఈ జట్టులో నా మెంటార్ రోహిత్ సర్. ఈ ప్రయాణం చాలా సుదీర్ఘమైనదని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని వారందరూ నాకు తరుచూ చెబుతుంటారు. ఏకాగ్రత తప్పకుండా కేవలం ఆట మీద మాత్రమే ఫోకస్ పెట్టాలని సూచిస్తుంటారు. నేను క్రీజులో ఉంటే 10-20 పరుగులు అదనంగా వచ్చేవి.
లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు నేను కాసేపు ఉంటే మరో రెండు ఓవర్ల ముందే మ్యాచ్ ముగించేవాళ్లం. ముందుగా బౌలింగ్ చేస్తే.. మరికొన్ని పరుగులు లక్ష్యానికి జోడిస్తాను. అందుకే ఒక లూజ్ షాట్ ఆడి ఔట్ అయినప్పుడు నేను బాధపడుతాను. ఇంకాసేపు ఆడి ఉండాల్సిందని నిరాశకు లోనవుతాను.'అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications