Ashwin Love story: స్కూల్లోనే స్పిన్నేశాడు..అశ్విన్ క్రేజీ లవ్ స్టోరీ..!!
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసి యావత్ క్రికెట్ ప్రపంచం షాక్ అయ్యేలా చేశాడు టీమిండియా టాప్ స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడవ టెస్టు అనంతరం అశ్విన్ తన రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. టెస్టు మ్యాచుల్లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో రెండో వాడిగా అశ్విన్ నిలిచాడు. 106 టెస్టు మ్యాచుల్లో 537 వికెట్లు తీసి 619 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే తర్వాత స్థానంలో నిలిచాడు. 2011లో టీమిండియా ప్రపంచకప్ గెలిచిన సమయంలో, 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో అశ్విన్ ఉన్నాడు.
రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో అతని వ్యక్తిగత జీవితంపై అందరి దృష్టి మళ్లింది.ముఖ్యంగా అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ గురించి నెటిజెన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రీతి నారాయణన్ అశ్విన్ చిన్ననాటి స్నేహితురాలు. ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదివారు. తాను ఈ రోజు ఇంతటి గొప్ప క్రికెటర్ అయ్యాడంటే తన వెనుక ప్రీతి పాత్ర గొప్పదని అశ్విన్ చెబుతుంటాడు.

క్యూట్ లవ్ స్టోరీ:
చెన్నైలోని పద్మ సదావన్ పాఠశాలలో అశ్విన్ ప్రీతినారాయణన్ కలిసి చదువుకున్నారు. ఆ రోజుల్లోనే ప్రీతిపై అశ్విన్‌కు ఎక్కడో చిన్న క్రష్ ఉండేదని ఈ మధ్యే జియో సినిమాలో చిట్ చాట్ సందర్భంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ విషయం అందరికీ ఎలా తెలిసిందో కూడా నెమరేసుకున్నారు.కొన్నేళ్ల డేటింగ్ తర్వాత 2011లో అశ్విన్-ప్రీతి నారాయణన్‌లు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు వారికి ఇద్దరు పిల్లలున్నారు.
"ఇద్దరం ఒకే స్కూలుకు వెళ్లేవాళ్లం.అలా ఒకరికొకరం పరిచయం అయ్యాం. ఆ తర్వాత పెరిగి పెద్దయ్యాం. చాలా కాలం తర్వాత తిరిగి కలిశాం.ఈవెంట్స్ కంపెనీలో నేను పనిచేసేదాన్ని. నాపై అశ్విన్‌కు క్రష్ ఉండేది. అది స్కూల్ మొత్తానికి తెలుసు." అని ఇండియా టుడేతో గతేడాది మాట్లాడుతూ చెప్పారు ప్రీతి నారాయణన్.
అశ్విన్ ప్రపోజ్ చేశాడు
క్రికెట్ పై ఫోకస్ చేస్తున్న క్రమంలో అశ్విన్ పలు స్కూళ్లు మారాడని చెప్పిన ప్రీతి.. బర్త్‌డేలు, ఇతరత్ర సమావేశాల సమయంలో టచ్‌లో ఉండేవాళ్లమని చెప్పుకొచ్చారు.ఇక కొన్నేళ్ల దూరం తర్వాత వీరిని తిరిగి క్రికెట్ రంగమే కలిపింది. ప్రీతి చెన్నై సూపర్ కింగ్స్‌కు పనిచేసేది. ఆ సమయంలో ఆరడుగుల అశ్విన్‌ను చూసి షాక్ అయినట్లు వెల్లడించారు. గ్రేడ్ 7 నుంచే ఒకరికొకరం తెలుసని తెలిపారు. ఒక రోజు అశ్విన్ తనను క్రికెట్ గ్రౌండ్‌కు తీసుకెళ్లి ప్రపోజ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. "చిన్నప్పటి నుంచి తెలుసు, నీపై నాకున్న ఫీలింగ్స్ గత పదేళ్లుగా అలానే ఉన్నాయి.ఇప్పుడు మనం మేజర్లం కాబట్టి పెళ్లి చేసుకుందాం" అని అశ్విన్ ప్రపోజ్ చేశాడట.
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినప్పటికీ అశ్విన్ మాత్రం క్లబ్ క్రికెట్‌లో కొనసాగుతానంటూ చెప్పాడు. మరోవైపు ప్రీతి నారాయణన్ జెన్ నెక్ట్స్ క్రికెట్ అకాడెమీ బాధ్యతలను నిర్వహిస్తూనే మరో కమర్షియల్ మీడియా కంపెనీని కూడా చూసుకుంటున్నారు. అశ్విన్ కెరీర్‌లో ప్రీతి ఒక కీలక పాత్ర పోషించారు. తన భర్త సాధించిన విజయాల గురించి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ ఉంటారు.
ఇంతకీ ప్రీతి ఎవరు..?
ప్రీతి నారాయణన్ 1988 మే 26వ తేదీన జన్మించారు. ఆమె ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశారు. ఫిట్‌నెస్‌పై చాలా ఫోకస్ చేసే ప్రీతి జిమ్‌లో ఎక్కువగా కనిపిస్తుంటారు. అంతేకాదు పలు మారథాన్‌లలో కూడా యాక్టివ్‌గా పాల్గొంటుంటారు. ఇక ఆమె మంచి క్లాసికల్ డ్యాన్సర్ కూడా. స్కూల్ మేట్స్ నుంచి లైఫ్ పార్టనర్ వరకు అశ్విన్ ప్రీతిల బంధం చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా అశ్విన్ సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఈ ఇల్లాలి పాత్ర అభినందనీయం.












Click it and Unblock the Notifications