Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పైనల్ లో అభిషేక్ పై సంచలన నిర్ణయం, కలిసొచ్చేనా - బూమ్ రాంగ్ అయ్యేనా..!!

T20 World Cup Final India Vs New Zealand: టీ20 ప్రపంచ కప్ ఫైనల్ వేళ టీం ఇండియా కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. విధ్వంసకర బ్యాటర్లు... పటిష్ఠమైన బౌలింగ్ లైనప్ తో అన్నింటా బలంగా కనిపిస్తున్న న్యూజీలాండ్ జట్టుతో ఫైనల్ కోసం కోచ్ గంభీర్ కొత్త ప్రణాళిక లు సిద్దం చేస్తున్నారు. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలమైనది కావటంతో... బ్యాటర్ల పైనే ఫలితం ఆధారపడి ఉండనుంది. దీంతో.. వరుసగా విఫలం అవుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానం పైన కోచ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు మ్యాచ్ లో కీలకంగా మారనుంది. ఛాంపియన్ గా టీం ఇండియా నిలుస్తుందా.. మ్యాచ్ వేళ ఏం జరుగుతోంది.

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ తుది జట్టు కూర్పు పైన కసరత్తు జరుగుతోంది. గవాస్కర్ లాంటి సీనియర్లు కీలక సూచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు సంజూ పైనే టీం భారం వేసిందని ఇప్పుడు జట్టు మొత్తం ఫైనల్ లో సమిష్టిగా రాణించాలని సూచిస్తున్నారు. అదే సమయంలో వరుసగా విఫలం అవుతున్న అభిషేక్ శర్మకు గవాస్కర్ పలు సూచనలు చేసారు. ఈ టోర్నీలో అభిషేక్ తన తప్పుల నుంచి ఏమాత్రం పాఠాలు నేర్చుకోలేదని, ప్రతి బంతినీ సిక్సర్ కొట్టాలని ప్రయత్నించి వికెట్ పారేసుకుంటున్నాడని మండిపడ్డారు. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మను పక్కన పెట్టి, ఇషాన్ కిషన్ చేత ఓపెనింగ్ చేయించాలని గవాస్కర్ సూచించారు. అభిషేక్ తన బలహీనతను ప్రత్యర్థులకు పట్టేలా చేస్తున్నాడు. ముఖ్యంగా చేతులకు గ్యాప్ లేకుండా బౌలర్లు బంతులు వేస్తుంటే తడబడుతున్నాడనే ప్రత్యర్థి టీం ఇప్పటి కే గ్రహించిందని అప్రమత్తం చేసారు. దీంతో.. గంభీర్ సైతం ఇదే ప్రతిపాదనతో సిద్దం అయినట్లు తెలుస్తోంది. ఓపెనింగ్ జోడీగా సంజూ - ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతారని సమాచారం.

 ఫిన్ అలెన్ vs బూమ్రా, ఎవరిని సైలెంట్ చేస్తే వారే ఛాంపియన్- గంభీర్ బిగ్ ప్లాన్..!!
ఫిన్ అలెన్ vs బూమ్రా, ఎవరిని సైలెంట్ చేస్తే వారే ఛాంపియన్- గంభీర్ బిగ్ ప్లాన్..!!
gavaskar-has-urged-the-team-management-to-drop-out-of-form-opener-abhishek-sharma-for-the-icc-mens

తుది జట్టు... బ్యాటింగ్ పొజీషన్స్ లో మార్పులు

అయితే, ఇప్పుడు పవర్ ప్లే లో అభిషేక్ రాణిస్తే భారీ స్కోరు ఖాయం. అయితే, మరోసారి అభిషేక్ విఫలం అయితే... టీం పైన మానసికంగా ప్రభావం పడుతుందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. దీంతో.. టీం కూర్పు పైన ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. కివీస్ తొలుత బ్యాటింగ్ చేస్తే వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రధానంగా బూమ్రా, వరుణ్ చక్రవర్తి పైనే ఉంది. మిగిలిన బౌలర్లు అంతగా రాణించటం లేదు. అదే విధంగా తొలుత బ్యాటింగ్ చేస్తే అభిషేక్, సంజూ, ఇషాన్ కిషన్ ఇచ్చే ప్రారంభం కీలకంగా మారనుంది. అభిషేక్, ఇషాన్ బలహీనతల పైనే కివీస్ బౌలర్లు ఎక్కువ గా ఫోకస్ చేసారు. దీంతో... ఇషాన్ - సంజూ తో ఇన్నింగ్స్ ప్రారంభించాలని భావిస్తున్నారు. ఛేజింగ్ కు దిగాల్సి వస్తే అభిషేక్ తోనే ఓపెనింగ్ చేయించి... పరిస్థితులకు అనుగుణంగా శివం దుబేకు ప్రమోషన్ ఇవ్వాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇక.. కివీస్ విధ్వంసకర బ్యాటర్ ఫిన్ అలెన్ ను నియంత్రించే బాధ్యత బూమ్రా పైనే పడుతోంది. అలెన్ ను కంట్రోల్ చేయగలిగితే... టీం ఇండియాకు సగం రిలీఫ్. దీంతో.. ఈ లెక్కల వేళ టాస్.. తుది జట్టు ఫైనల్ లో ఛాంపియన్ ను డిసైడ్ చేయనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+