ఫ్యాన్స్ కు గమనిక: ఆసియా కప్ టైమ్ టేబుల్ లో భారీ మార్పులు

ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకొద్దిరోజుల్లో ఈ టోర్నమెంట్ ఆరంభం కాబోతోంది. సెప్టెంబర్ 9వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. 28వ తేదీన ఫైనల్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. దీనికి వేదిక. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సన్నాహలకు అనుగుణంగా ఈ టోర్నమెంట్ అదే ఫార్మాట్‌లో జరుగుతుంది.

ఈ ఎడిషన్‌లో ఎనిమిది జట్లు పాల్గొనబోతోన్నాయి. టైటిల్ కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, ఒమన్.. తలపడనున్నాయి. మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇప్పటికే మ్యాచ్ ల తేదీలు, గ్రూపులు, వెన్యూలు ఖరారయ్యాయి కూడా.

Gear Up for the Asia Cup 2025 Match Timings Have Been Changed

తాజాగా ఆసియా కప్ 2025 మ్యాచ్‌ల ప్రారంభ సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమౌతాయి. ఈ మార్పును ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ధృవీకరించింది. ఈ మేరకు సవరించిన సమయాన్ని ప్రకటించింది.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండేది. దీన్ని అరగంట ముందుకు జరిపింది. ఒక్క మ్యాచ్ మినహా మిగిలినవన్నీ కూడా రాత్రి 8 గంటలకు మొదలవుతాయి. సెప్టెంబర్ 15న అబుదాబిలో యూఏఈ, ఒమన్ మధ్య జరిగే మ్యాచ్ మాత్రం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:00 గంటలకు అంటే-భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 జరుగుతుంది.

ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ గ్రూప్ఏలో ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంగ్ కాంగ్ గ్రూప్ బీలో భాగమయ్యాయి. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు సూపర్ ఫోర్స్ దశకు అర్హత సాధిస్తాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సెప్టెంబర్ 14న భారత్-పాకిస్తాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుంది.

ఆసియా కప్ కు ఎంపికైన భారత జట్టులో- సూర్య కుమార్ యాదవ్ (కేప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కేప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్ దీప్ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్ ఉన్నారు.

స్టాండ్‌బై: యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+