మ్యాచు పాయె.. డబ్బులూ పాయె: ఎన్ని కష్టాలొచ్చాయ్ మచ్చా

GT vs MI: ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కష్టాలు తీరట్లేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయిందా జట్టు. అహ్మదాబాద్‌లో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తుగా ఓడింది. ఇప్పటివరకు ఆడిన రెండింట్లోనూ ఘోరంగా ఓడింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి దిగజారింది.

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. 36 పరుగుల తేడాతో మట్టికరిచింది.

GT vs MI Hardik Pandya has been fined Rs 12 Lakh for slow over-rate in IPL 2025

ఓపెనర్ సాయి సుదర్శన్ టాప్ స్కోరర్ ఈ ఇన్నింగ్‌లో. 41 బంతుల్లో రెండు భారీ సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 63 పరుగులు కొట్టాడు. కేప్టెన్ శుభ్‌మన్ గిల్- 38, టాప్ ఆర్డర్ బ్యాటర్ జోస్ బట్లర్- 39 పరుగులతో రాణించారు. మిడిలార్డర్‌లో షెర్ఫానె రూథర్‌ఫర్డ్- 18 పరుగులు తప్ప మిగిలిన వాళ్లు చేసింది సింగిల్ డిజిట్టే.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత ఎక్కడే గానీ భారీ భాగస్వామ్యం ఏర్పడలేదు. టాప్ ఆర్డర్‌లో తిలక్ వర్మ- సూర్యకుమార్ యాదవ్ మధ్య నెలకొన్న 62 పరుగులే అతిపెద్ద పార్ట్‌నర్‌షిప్.

తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ ఓవర్ నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మహ్మద్ సిరాజ్ వేసిన రిప్పర్‌కు అతని వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఆఫ్ సైడ్ స్టంప్‌కు కాస్త అవతల పిచ్ అయి వికెట్ల మీదికి దూసుకొచ్చిన ఆ బంతిని ఏ మాత్రం అంచనా వేయలేకపోయాడు రోహిత్ శర్మ. అతను అవుట్ కావడం బ్యాటింగ్ ఆర్డర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.

లోయర్ ఆర్డర్‌లో ఆదుకుంటాడని భావించిన కేప్టెన్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం చేతులెత్తేయడం ముంబై ఇండియన్స్ ఓటమికి బాటలు వేసినట్టయింది. ఏకంగా 17 బంతులను ఎదుర్కొని అతను చేసిన పరుగులు 11. ఇందులో ఒకే ఒక్క ఫోర్. రాబిన్ మిన్జ్ సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యాడు.

ఓడిపోవడం ఒక్కటే కాదు ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు మరో షాక్ కూడా తగిలింది తాజాగా. కేప్టెన్ హార్దిక్ పాండ్యాపై 12 లక్షల రూపాయల జరిమానా పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా అతను ఈ ఫైన్‌కు బాధ్యుడయ్యాడు. ఈ సీజన్ ఆరంభంలోనే స్లో ఓవర్ రేట్ రన్ చేశాడంటే ఇంకా మిగిలిన మ్యాచ్‌లల్లో ఎలా మెయింటెన్ చేస్తాడో చూడాలి.

2024 సీజన్‌లో కూడా స్లో ఓవర్ రేట్‌ను ఎదుర్కొన్నాడు హార్దిక్ పాండ్యా. ఓ మ్యాచ్‌కు సైతం దూరం కావాల్సొచ్చిందతనికి. అందుకే- ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడలేకపోయాడు. అయినప్పటికీ- తన తీరును మార్చుకోలేకపోయాడీ ఆల్‌రౌండర్. మరోసారి అదే బాట పట్టాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+