టీ20 వరల్డ్ కప్ గెలిచేది ఆ జట్టే..!!
టీ20 వరల్డ్ కప్ గడువు దగ్గరపడుతోంది. ఇంకొద్ది రోజులే మిగిలివుంది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నమెంట్ ఇది. మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి. 55 మ్యాచ్‌లు ఆడతాయి. ఫిబ్రవరి 7వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ లో నెదర్లాండ్స్ తో తలపడనుంది పాకిస్తాన్. శ్రీలంకలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. అదే రోజు ముంబై వాంఖెడే స్టేడియంలో యూఎస్ఏను ఢీకొట్టనుంది భారత్.
భారత్ మరోసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను నిలబెట్టుకోగలదా అనే చర్చ మొదలైంది. దీనిపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భారత్‌కు టీ20 ప్రపంచకప్ గెలవడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయని అన్నాడు. జట్టు బలంగా ఉందని, స్వదేశంలో ఈ టోర్నమెంట్ జరగబోతోండటం వల్ల పిచ్, వాతావరణం, ఇతర పరిస్థితులు మరింత అనుకూలంగా ఉంటాయని పేర్కొన్నాడు. అన్ని జట్ల కంటే వారికి ఆ వాతావరణంపై మెరుగైన అవగాహన ఉందని వ్యాఖ్యానించాడు.

అదే సమయంలో ఓ హెచ్చరిక కూడా చేశాడు హర్భజన్. ప్రపంచకప్ ఒత్తిడిని మిగతా జట్ల కంటే సమర్థవంతంగా ఎదుర్కోవడం అనేది అత్యంత కీలకమైన అంశం అవుతుందని పేర్కొన్నాడు. జట్టు ఎటువంటి ఒత్తిళ్లకూ తలొగ్గకుండా ఉండటం ప్రధానమని, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ పై దీని ప్రభావం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ పై ఉందని అన్నాడు. మిగిలిన జట్లు కూడా ఏ మాత్రం తీసిపోని విధంగా పోటీ ఇవ్వగలవని చెప్పాడు.
ఆస్ట్రేలియా ఓ అద్భుతమైన జట్టుగా హర్భజన్ సింగ్ అభివర్ణించాడు. ఏ టోర్నమెంట్‌లో అయినా సరే.. డిఫెండింగ్ ఛాంపియన్ గా అడుగు పెడుతుందని, అదే స్థాయిలో ఆడుతుందని పేర్కొన్నాడు. ఈ టోర్నమెంట్ లో కూడా టాప్ కంటెండర్ గా ఉండి తీరుతుందని అభిప్రాయపడ్డాడు. దీని తర్వాత ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే దక్షిణాఫ్రికాలో కూడా టైటిల్ గెలిచే సత్తా ఉందని, ఆ జట్టు ఇటీవల అద్భుతమైన క్రికెట్ ఆడిందని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు.
అఫ్ఘానిస్తాన్ జట్టు గురించి హర్భజన్ ప్రస్తావించాడు. ఆసియా ఉపఖండంలో అత్యంత వేగంగా, బలంగా తయారైన జట్టు అని కితాబిచ్చాడు ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ విభాగంలో తిరుగులేని జట్టుగా ఎదిగిందని, పరిస్థితులు తమకు అనుకూలించినప్పుడు ఎలాంటి జట్టునైనా ఓడించగలరని అన్నాడు. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్ఘానిస్తాన్ సెమీస్ చేరుకుంటాయని, ఒత్తిడిని జయించిన జట్టు ఛాంపియన్ గా నిలుస్తుందని జోస్యం చెప్పాడు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications