స్పెక్యులేషన్స్ కు చెక్ పెట్టిన హార్దిక్ పాండ్యా: ముంబై ఇండియన్స్ కేప్టెన్సీపై.. !!
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ఇప్పుడే వ్యూహాలను సిద్ధం చేస్తోంది. జట్టులో ఎలాంటి భారీ మార్పులు చేయడానికి యాజమాన్యం సుముఖంగా ఉండట్లేదు. ప్రత్యేకించి.. హెడ్ కోచ్, సపోర్టింగ్ స్టాఫ్ విషయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయాలనుకోవట్లేదు. ఇందులో భాగంగానే శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనేను హెడ్ కోచ్‌గా కొనసాగించాలని ఫ్రాంచైజీ యాజమాన్యం నిర్ణయించినట్లు సమాచారం.
2025 నాటి ఐపీఎల్ సీజన్‌కు ముందు 2+1 ఒప్పందంపై ముంబై హెడ్ కోచ్ రీ అపాయింట్ అయ్యాడు.. జయవర్ధనే. దీని ప్రకారం వచ్చే ఐపీఎల్ సీజన్ ఆయన కాంట్రాక్టులో చివరి ఏడాది అవుతుంది. 2017 నుంచి 2022 మధ్య కాలంలో జయవర్ధనే కోచింగ్‌లోనే ముంబై ఇండియన్స్ మూడు సార్లు ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుంది గానీ.. ఆ తర్వాతే పరాజయాలు వెంటాడాయి. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ ది ఫ్లాప్ షో. అయినప్పటికీ.. జయవర్దనేపై పూర్తి నమ్మకం పెట్టుకుంది ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్.

అదే సమయంలో కేప్టెన్సీపై కూడా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో చర్చలు నడుస్తోన్నాయి. ప్రస్తుత కేప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్‌పై కొన్ని రోజులుగా పలు ఊహాగానాలు వినిపిస్తో వస్తోన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కత నైట్ రైడర్స్ కు వెళ్తాడనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది కూడా. వాటన్నింటికీ ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ చెక్ పెట్టిందని సమాచారం. ఆక్షన్ కోసం హార్దిక్ పాండ్యాను రిలీజ్ చేయకూడదని, అతన్ని రిటైన్ చేసుకోవాలని నిర్ణయించింది.
నిజానికి.. హార్దిక్ పాండ్యా ఆయా ఐపీఎల్ ఫ్రాంచైజీలతో చర్చలు జరిగాయి. అవేవీ కూడా అతని అంచనాలకు తగినట్టుగా ఉండట్లేదు. అదే సమయంలో ప్లేయర్ల స్వైపింగ్ విషయంలో ముంబై ఇండియన్స్ కు ప్రయోజనకరంగా ఉండే ఒప్పందాలవీ కుదరలేదు. దీంతో రాబోయే సీజన్‌లోనూ పాండ్యాను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా కోరిక మేరకు ప్లేయర్ గా మాత్రమే కొనసాగించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కేప్టెన్సీ రేస్ లో తిలక్ వర్మ, జస్ ప్రీత్ బుమ్రా ఫ్రంట్ రన్నర్లుగా ఉన్నారని అంటున్నారు.
ముంబై ఇండియన్స్ మరో కీలక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తు గురించి కూడా స్పష్టత వచ్చింది. ఈ ఐపీఎల్ సీజన్ అతనికి ఏ మాత్రం కలిసిరానప్పటికీ.. అతన్ని వదులుకోవడానికి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సిద్ధంగా లేదు. ఒకట్రెండు సీజన్ లల్లో వైఫల్యాల ఆధారంగా కీలక ఆటగాళ్ళను దూరం చేసుకోకూడదని ఫ్రాంఛైజీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.














Click it and Unblock the Notifications