స్టార్ సింగర్‌తో హార్దిక్ పాండ్యా ఎఫైర్ ..హోటల్ వీడియో బయటకు రావడంతో మ్యాటర్ మొత్తం లీక్
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యా ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత హార్దిక్ పాండ్యా పేరు మార్మోగిపోయింది. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి, కప్ గెలవడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యా ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత హార్దిక్ పాండ్యా పేరు మార్మోగిపోయింది. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి, కప్ గెలవడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. ఇదే సమయంలో వ్యక్తిగతంగా కూడా హార్దిక్ పాండ్యా వార్తల్లో నిలిచారు.
భార్య నటాషాతో హార్దిక్ విడిపోయారు. ఆమెకు విడాకులు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్దిక్, ఆ తర్వాత భార్య నటాషాతో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఆమెకు విడాకులిచ్చాడు. కొడుకుతో కలిసి నటాషా తన సొంత దేశం అయిన స్వీడన్‌కు వెళ్లిపోయారు. భార్యతో విడాకులు అనంతరం హార్దిక్ , బాలీవుడ్ హీరోయిన్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే, హార్దిక్ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరు కలిసి అంబానీ పెళ్లిలో సందడి చేశారు. హిందీ పాటలకు ఇద్దరు కలిసి చిందులు వేసిన వీడియోలు సోషల్ మీడియిలో తెగ వైరల్ అయ్యాయి.

దీనికి తోడు సోషల్ మీడియాలో వీరిద్దరు ఒకర్ని ఒకరు ఫాలో అవుతున్నారు. దీంతో అనన్య పాండే, హార్దిక్‌లు రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. అంబానీ పెళ్లి తర్వాత వీరిద్దరు తరుచుగా కలుసుకుంటున్నారని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా హార్దిక్ పాండ్యాకు సంబంధించి మరో ఎఫైర్ బయటకు వచ్చింది. హార్దిక్ ఓ సింగర్‌తో డేటింగ్ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం బ్రిటన్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియాతో రిలేషన్‌లో ఉన్నారని తెలుస్తోంది.
హార్దిక్ పాండ్యా పోస్ట్ చేసిన ఓ వీడియోకు జాస్మిన్ వాలియా లైక్ కొట్టారు. నాలుగు రోజుల క్రితం సరిగ్గా ఇదే ప్లేస్ లో వాలియా కూడా ఫొటో దిగి ఇన్ స్టాలో షేర్ చేయగా.. ఈ పోస్టుకు పాండ్యా లైక్ కొట్టాడు. దీంతో వీరు డేటింగ్ చేస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలోనూ వాలియా పెట్టిన పలు పోస్ట్‌లకు పాండ్యా కామెంట్లు చేశాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ కలిసే విహారయాత్రకు వెళ్లారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై హార్దిక్ పాండ్యా ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.












Click it and Unblock the Notifications