హార్దిక్ పాండ్యా ఆడేది అప్పుడే
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ యూటర్న్ తీసుకుంది. విజయాల నుంచి అపజయాల వైపు తిరిగింది. శనివారం ఢిల్లీ కేపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడింది. ఏ మాత్రం ఛాంపియన్ ఆటతీరును ప్రదర్శించలేకపోయిందీ జట్టు. తొలుత బ్యాటింగ్, అనంతరం బౌలింగ్ లో విఫలమైంది. జట్టు ఆటగాళ్లు సమష్టిగా విఫలం అయ్యారనడానికి ఈ క్లాష్ ఓ ఉదాహరణ. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగా.. దీన్ని అలవోకగా అందుకుంది ఢిల్లీ కేపిటల్స్.
ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్, కేప్టెన్ హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడం పెద్ద లోటుగా కనిపించింది. అనారోగ్యం కారణంగా అతను ఆ మ్యాచ్ కు దూరం అయ్యాడు. ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటోన్నాడు. అతనికి బదులుగా సూర్యకుమార్ యాదవ్ జట్టుకు నాయకత్వం వహించాడు. అర్ధ సెంచరీతో రాణించాడు. ఇది ఆ జట్టుకు కాస్త ఊరటనిచ్చింది. మంగళవారం రాజస్థాన్ రాయల్స్ ను ఎదుర్కొనాల్సి ఉంది ముంబై ఇండియన్స్ కు.

ఈ ఐపీఎల్ సీజన్ లో వరుస విజయాలను అందుకుంటూ టేబుల్ టాపర్ గా నిలిచిన జట్టు ఇది. దీని దూకుడును అడ్డుకోవాలంటే నిఖార్సయిన ఆల్ రౌండర్ అవసరం. ఈ పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ కు శుభవార్త అందింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ కు బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడు. హార్దిక్ పాండ్యాకు గాయాలు కాలేదని, వైరల్ ఫీవర్ కారణంగానే ఆ మ్యాచ్ ఆడలేదని తెలిపింది.
హార్దిక్ విషయంలో ముంబై ఇండియన్స్ ఎటువంటి రిస్క్ తీసుకోదలచుకోలేదు. పాండ్యా మరిన్ని మ్యాచ్‌లకు దూరం కావొచ్చంటూ తొలుత వార్తలు వచ్చాయి గానీ అవేవీ వాస్తవ రూపాన్ని దాల్చే అవకాశాలు దాదాపుగా లేనట్టే. 7న గువహతిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే ముంబై ఇండియన్స్ తదుపరి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆడతాడనే అంచనా ఉన్నాయి. నిలకడగా బౌలింగ్, బ్యాటింగ్ చేయగలిగే పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ను సాధిస్తాడని ఫ్రాంఛైజీ భావిస్తోంది.
రాజస్థాన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నందున ముంబై ఇండియన్స్ కు ఇది కీలక మ్యాచ్. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ వంటి స్టార్ బ్యాటర్లతో ముంబై బౌలింగ్ విభాగం కఠిన పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ ఆడటం అత్యవసరమైంది.
రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న ఈ కీలక పోరు కోసం ముంబై ఇండియన్స్ తుదిజట్టులో- రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కేప్టెన్), షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ఆడే అవకాశం ఉంది.
-
ఇక పులులు, సింహాలతో కంపేరిజను వద్దయ్యో -
చెన్నై సూపర్ కింగ్స్ కు పొంచివున్న పెద్ద గండం: ఆర్సీబీ హీరో కమ్ బ్యాక్ -
IPL 2026: మలుపు తిప్పిన ఆర్చర్, తుషార్.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ విజయం! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ??












Click it and Unblock the Notifications