ఓరి వీడి ఏషాలో.. పట్టుకోలేకపోతున్నాం అబ్బాయ్ !!

టీ20 వరల్డ్ కప్ ఎంతో దూరం లేదు. ఇంకొక్క రోజే. ఈ నెల 7వ తేదీన ప్రారంభం కాబోతోందీ టోర్నమెంట్. ప్రస్తుతం వామప్స్ నడుస్తున్నాయి. టోర్నీ ఆరంభ రోజునే మ్యాచ్ ఆడబోతోంది టీమిండియా. అమెరికాతో తలపడనుంది. ఈ పోరుకు భారత ఆటగాళ్లందరూ సన్నద్ధమవుతున్నారు. ప్రతిష్ఠాత్మక ముంబై వాంఖెడే స్టేడియం దీనికి వేదిక. టీమిండియా బాగా అచ్చొచ్చిన స్టేడియంగా దీనికి గుర్తింపు ఉంది. తొలి మ్యాచ్ కూడా అక్కడే ఆడబోతోంది.

ఈ మ్యాచ్‌కు 24 గంటల ముందు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అకస్మాత్తుగా వార్తల్లో నిలిచాడు. తన కొత్త లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. కొత్త హెయిర్‌కట్ చేయించుకున్నాడు. జుట్టుకు వైట్ బ్లాండ్ కలర్ వేయించుకున్నాడు. బ్లీచింగ్ పద్ధతి ద్వారా చేసిన ఈ కలర్.. లేత తెలుపు/ యాషీ టోన్‌తో ఉందీ హెయిర్ స్టైల్. సాధారణంగా దీన్ని సిల్వర్, గ్రే లేదా వైట్ బ్లాండ్ అని పిలుస్తారు. ఈ కొత్త లుక్‌లో ఠపీమని హార్దిక్‌ పాండ్యాను గుర్తించడం కాస్త కష్టమే.

Hardik Pandya Team India All-rounder captured attention with Blonde Hairstyle Ahead of T20 World Cup

హార్దిక్ పాండ్యా న్యూ లుక్‌తో ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానుల నుంచి లైకులు, కామెంట్ల వర్షం కురిసింది. అతను చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. 2024లో జరిగిన టీ20 వరల్డ్ కప్ సమయంలో గడ్డం లేకుండా క్లీన్ షేవ్, పొడవాటి మీసాలు, షార్ట్ గా కట్ చేసిన హెయిర్ స్టైల్ తో కనిపించాడీ ఆల్ రౌండర్. ఓ విభిన్నమైన లుక్‌లో మెరిశాడు అప్పట్లో. ఇప్పుడు దీనికి భిన్నమైన అవతారం ఎత్తాడు. లైట్ గా గడ్డం పెంచుకున్నాడు. వైట్ బ్లాండ్ హెయిర్‌స్టైల్‌తో గ్రౌండ్ లోకి దిగబోతోన్నాడు. సిక్సర్ల వర్షం కురిపించడానికి సిద్ధమవుతున్నాడు.

టీమ్ ఇండియాకు హార్దిక్ పాండ్యా ఒక బలం. ఈ వరల్డ్ కప్‌లో కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌క రైట్ హ్యాండ్. ఓ బ్రహ్మాస్త్రంగా చెప్పుకోవచ్చు. బౌలింగ్, బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించే సామర్థ్యం అతనికి ఉంది. వామప్స్ లోనూ అదరగొట్టాడు. గత 2024 ఫైనల్‌ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో 16 పరుగులు డిఫెండ్ చేసి భారత్‌కు విజయం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి హార్దిక్ తన సత్తా చాటడానికి బరిలోకి దిగనున్నాడు.

అతను నిలకడగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు. బ్యాటింగ్‌లో ఆరో స్థానంలో అతను విధ్వంసకర రీతిలో పరుగులు సాధించగలడనేది అతని రికార్డులను బట్టి చూస్తే ఇట్టే అర్థమౌతుంది. హార్దిక్ పాండ్యా టీ20 ఇంటర్నేషనల్ కెరీర్‌ను పరిశీలిస్తే.. ఇప్పటివరకు 129 మ్యాచ్‌లు ఆడి 28.37 సగటుతో 2,071 పరుగులు చేశాడు. ఇందులో ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 105 వికెట్లను నేలకూల్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+