అతనితో కలిసి దేశం విడిచి వెళ్లిపోయిన హార్దిక్ భార్య (వీడియో)

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యా వివాహిక జీవితం గురించి అందరికి తెలిసిందే. హార్దిక్ పాండ్యా హీరోయిన్ నటాషా స్టాంకోవిచ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆ పార్టీలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో ఈ జంట పెళ్లి వరకు తమ బంధాన్ని తీసుకువెళ్లారు. అయితే పెళ్లికి ముందు రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరు.. పెళ్లికి ముందే కమిట్ అయ్యారని తెలుస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. హార్దిక్ పాండ్యా,నటాషా స్టాంకోవిచ్‌లు పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే నటాషా తల్లి కాబోతుందనే వార్త బయటకు వచ్చింది.

ఇదిలా ఉంటే నటాషా హార్దిక్ పాండ్యాకు విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతుందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనికి అనుగుణంగానే నటాషా ప్రవర్తన కూడా ఉండటంతో ఈ వార్తలకు మరింతబలం చేకూరినట్లు అయింది.అలాగే మార్చి 4 నటాషా పుట్టినరోజు. ఆ రోజు, హార్దిక్ పాండ్యా తన భార్యకు సోషల్ మీడియాలో ఒక్క పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా పోస్ట్ చేయలేదు.దీనికి తోడు నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి పాండ్యా అనే ఇంటిపేరును తొలగించింది. దీంతో వీరి విడాకులు ఖాయమని అంతా భావించారు.

Hardik Pandya wife Natasa Stankovic leaves india

విడాకులు వార్తలు వినిపిస్తోన్న సమయంలోనే నటాషా మరో వ్యక్తితో క్లోజ్‌గా కనిపిస్తూ దర్శనం ఇచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశాపటానీ బాయ్‌ఫ్రెండ్‌గా చెప్పుకుంటున్న అలెగ్జాండర్ అలెక్సిలిక్‌తో మీడియా కంటబడింది నటాషా. హార్దిక్ పాండ్యాతో విభేదాలు తలెత్తిన తర్వాతే ఆమె అలెగ్జాండర్ అలెక్సిలిక్‌‌తో రిలేషన్‌ను మెయిన్‌టైన్ చేస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే నటాషా తాజాగా ఇండియా వదిలి వెళ్లిపోయింది. తన కుమారుడు అగస్త్యను తీసుకుని తన సొంత దేశం సెర్బియాకు వెళ్లిపోయిందని సమాచారం అందుతోంది.

వీరిద్దరూ ముంబై విమానాశ్రయంలో కనిపించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి. ఇదే సమయంలో త నటాసా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కూడా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. మొదటి ఫోటోలో.. నటాషా తన క్లాత్స్ ప్యాక్ చేసుకున్న సూట్‌కేస్‌ను పెట్టింది. ఈ సంవత్సరంలో ఆ సమయం వచ్చింది అంటూ పలు ఎమోజీలను.. కన్నీళ్లతో ఉన్న ఎమోజీతో పాటు విమానం, ఇల్లు, లవ్‌ సింబల్‌ను ఆమె షేర్‌ చేసింది. దీంతో ఆమె ఇండియా వదిలి వెళ్లిపోయిందని అంతా చర్చించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+