హార్దిక్ పాండ్యాకు మరో షాక్..ప్రియుడుతో రెచ్చిపోయిన నటాషా..వీడియో వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా విడాకుల వార్త సంచలనం రేపుతోంది. హార్దిక్ పాండ్యా భార్య నటాషా అతనికి విడాకులు ఇవ్వడానికి రెడీ అయింది. 2020లో హార్దిక్ పాండ్యా హీరోయిన్ నటాషా స్టాంకోవిచ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందే కమిట్ అయిన ఈ జంట.. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే నటాషా తల్లైంది.పెళ్లి తర్వాత ఈ జంట తమ దాంపత్య జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేశారు. హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో ఏ టీం తరుఫున ఆడిన ఆమె అతనికి మద్దతిచ్చేది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‌గా పాండ్యా అరంగేట్రం చేసినా.. నటాషా మాత్రం కనిపించలేదు. అలాగే, అతను ఏ మ్యాచ్ చూసేందుకు రాలేదు.
అలాగే మార్చి 4 నటాషా పుట్టినరోజు. ఆ రోజు, హార్దిక్ పాండ్యా తన భార్యకు సోషల్ మీడియాలో ఒక్క పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా పోస్ట్ చేయలేదు.దీనికి తోడు నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి పాండ్యా అనే ఇంటిపేరును తొలగించింది. దీంతో నటాషా హార్దిక్ పాండ్యాకు విడాకులు ఇవ్వడం ఖాయమనే అంతా భావిస్తున్నారు. ఇదే సమయంలో నటాషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేసింది. 'ఒకరు రోడ్డున పడబోతున్నారు' అనే క్యాప్షన్‌తో ట్రాఫిక్ సిగ్నల్స్ ఫొటో షేర్ చేసింది. అయితే.. ఈ పోస్ట్ హార్దిక్ పాండ్యను ఉద్దేశించి పెట్టిందంటూ నెట్టింట రచ్చ మొదలు పెట్టారు నెటిజన్లు.

ఇక విడాకులు వార్తలు వినిపిస్తోన్న సమయంలోనే నటాషా మరో వ్యక్తితో క్లోజ్‌గా కనిపిస్తూ దర్శనం ఇచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశాపటానీ బాయ్‌ఫ్రెండ్‌గా చెప్పుకుంటున్న అలెగ్జాండర్ అలెక్సిలిక్‌తో మీడియా కంటబడింది నటాషా. పాండ్యాతో విడాకుల వార్తలపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నవ్వేసి 'థ్యాంక్యూ'అని వెళ్లిపోయారు. హార్దిక్ పాండ్యాతో విభేదాలు తలెత్తిన తర్వాతే ఆమె అలెగ్జాండర్ అలెక్సిలిక్‌తో రిలేషన్‌ను మెయిన్‌టైన్ చేస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
ప్రియుడుకు ముద్దులిచ్చిన హార్దిక్ పాండ్యా భార్య నటాషా..వీడియో వైరల్#HardikPandya #NatasaStankovic #AleksanderAlexllic #Divorce #ViralVideo #Oneindiatelugu pic.twitter.com/Nnj2YWbpAs
— oneindiatelugu (@oneindiatelugu) May 31, 2024
ఇదిలా ఉంటే తాజాగా నటాషా అలెగ్జాండర్ అలెక్సిలిక్‌తో క్లోజ్‌గా మూవ్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు కలిసి ఓ రీల్ చేసిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో చివర్లో నటాషా అలెగ్జాండర్‌కు లిప్ లాక్ ఇవ్వడం సంచలనంగా మారింది. అయితే ఇది పాత వీడియో అని తెలుస్తోంది. వీడియో పాతది అయినా కూడా అలెగ్జాండర్‌తో నటాషా ఇలా చేయడం సరైంది కాదంటున్నారు నెటిజన్లు. ఈ విషయంలో హార్దిక్ పాండ్యాకు మద్దతుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications