కాటేరమ్మ కొడుకు దెబ్బకు ఓవర్ వేయకుండా పారిపోయిన కేకేఆర్ బౌలర్

భారీ అంచనాల మధ్య ఈ సీజన్‌లో మొదలుపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్, తన పేలవ ఆటతీరుతో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. ఆడిన 14 మ్యాచుల్లో 6 గెలిచి, 7 ఓడిపోయింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో 13 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే చివరి మూడు మ్యాచుల్లో మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ తన సత్తా చాటింది. మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఫ్లే ఆఫ్ రేసులో ఉన్న లక్నో టీంను ఓడించి తమతో పాటు ఇంటికి తీసుకువెళ్లింది.

అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఎంతో ఇష్టమైన జట్టుగా గుర్తింపు దక్కించుకున్న బెంగళూరుపై కూడా తమ పంజా విసిరింది.బెంగళూరు టీంపై విజయం సాధించి వారి రెండో స్థానానికి గండి కొట్టింది.ఇక గతేడాది కేకేఆర్ చేతిలో ఫైనల్‌లో ఓడిపోయింది హైదరాబాద్ జట్టు. ఫైనల్‌లో ఓడిపోయిన దాని కన్నా , ఆ సమయంలో కేకేఆర్ ఆటగాళ్లు చేసిన అతిని సన్ రైజర్స్ అభిమానులు ఎప్పటికీ మార్చిపోరు. ముఖ్యంగా హర్షిత్ రాణాను. సన్ రైజర్స్ ప్రధాన ఆటగాళ్ల వికెట్లు తీసిన సమయంలో మనోడు చేసిన సెలబ్రేషన్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. దీంతో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని సన్ రైజర్స్ అభిమానులు భావించారు.

Harshit Rana did not bowl the fourth over in the match against Sunrisers Hyderabad

దీనికి తగ్గట్టే ఆదివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. టాప్ ఆర్డర్ ఆటగాళ్లు రాణించారు. ముఖ్యంగా కాటేరమ్మ కొడుకుగా గుర్తింపు తెచ్చుకున్న హెన్రిచ్ క్లాసెన్ కేకేఆర్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. క్లాసెన్ కేవలం 37 బంతుల్లోనే సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో మూడో వేగవంతమైన సెంచరీ. క్లాసెన్ దెబ్బకు హర్షిత్ రాణా అయితే మరో ఓవర్ వేయకుండా సైలెంట్ అయ్యాడు. ఈ మ్యాచులో మూడు ఓవర్లు వేసిన హర్షిత్ రాణా ఏకంగా 40 పరుగులు సమర్పించుకున్నాడు. హర్షిత్ రాణాను టార్గెట్ చేసుకుని క్లాసెన్ సిక్సర్ల వర్షం కురిపించడంతో కేకేఆర్‌ కెప్టెన్ రహానే , అతనికి మరో ఓవర్ ఇచ్చే సాహసం చేయలేదు.

అయినప్పటికీ క్లాసెన్ ఊచకోత మాత్రం ఆగలేదు. ఫోర్లు, సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తద్వారా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుఫున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడి రికార్డు నెలకొల్పాడు. అలాగే 278 పరుగులు చేయడంతో ద్వారా హైదరాబాద్ జట్టు ఐపీఎల్‌ చరిత్రంలో అత్యధిక స్కోరు జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. మొదటి ఐదు స్థానాల్లో నాలుగు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేరిట ఉండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+