చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కేప్టెన్

Pat Cummins: టీ20 వరల్డ్ కప్ 2024లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ చరిత్ర సృష్టించాడు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌లో తొలిసారిగా హ్యాట్రిక్ అందుకున్నాడు. సూపర్ 8లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అతను ఈ ఘనతను సాధించాడు. కమ్మిన్స్ సహా మిగిలిన ఆసీస్ బౌలర్లు చెలరేగారు. బంగ్లాదేశ్‌ను కట్టడి చేశారు.

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా బార్బుడాలోని నార్త్ సౌండ్ స్టేడియంలో ఆస్ట్రేలియా.. బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ..ఆసీస్ బౌలర్లను ఎదుర్కొనలేక చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.

Hat-trick for Pat Cummins against Bangladesh in T20 World Cup 2024

టాప్ ఆర్డర్ బ్యాటర్, కేప్టన్ నాజ్ముల్ హొస్సైన్ శాంటో 41, మిడిలార్డర్‌లో తౌహీద్ హృదొయ్- 40, ఓపెనర్ లిట్టన్ దాస్- 16, చివర్లో తస్కీన్ అహ్మద్- 13 (నాటౌట్) పరుగులు చేయగలిగారంతే. మిగిలిన బ్యాటర్లెవరూ డబుల్ డిజిట్ స్కోర్ కూడా అందుకోలేకపోయారు. బౌలర్లల్లో జోష్ హేజిల్‌వుడ్ మినహా మిగిలిన వారందరూ వికెట్ల పడగొట్టారు.

ప్రత్యేకించి- పాట్ కమ్మిన్స్ దుమ్ము లేపాడు. హ్యాట్రిక్‌తో బంగ్లాదేశ్ బ్యాటర్లకు చుక్కలు చూపాడు. 18వ ఓవర్ చివరి రెండు బంతులు, 20వ ఓవర్ తొలి బంతికి వరుస వికెట్లు నేలకూల్చాడు. ఈ టీ20 వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్లల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన రెండో బౌలర్ అతనే. గతంలో ఇదే బంగ్లాదేశ్‌పై బ్రెట్ లీ హ్యాట్రిక్ సాధించాడు. మొత్తంగా ఇది ఏడో హ్యాట్రిక్.

18వ ఓవర్ అయిదో బంతికి మహ్మదుల్లాను పెవిలియన్ దారి పట్టించాడు కమ్మిన్స్. క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఫ్ స్టంప్‌కు కాస్త దూరంగా వెసిన షార్ట్ గుడ్ లెంగ్త్ బంతిని పుల్ చేశాడు మహ్మదుల్లా. బ్యాట్ అంచులను తాకిన ఈ బంతి వికెట్లను ఎగురగొట్టింది.

ఆరో బంతికి మెహదీ హసన్‌ను బలి తీసుకున్నాడు. ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెసిన లెంగ్తీ డెలివరీని అప్పర్ కట్ ఆడబోయాడు బ్యాటర్. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి డీప్ థర్డ్ మ్యాన్ వైపు గాల్లోకి ఎగిరింది. అక్కడే కాచుకుని ఉన్న ఆడం జంపా చేతుల్లో వాలింది.

20వ ఓవర్ తొలి బంతికి తౌహీద్ హృదయ్ వికెట్ కూల్చాడు కమ్మిన్స్. స్లోయర్ డెలివరీని షార్ట్ ఫైన్ లెగ్ దిశగా స్కూప్ షాట్ ఆడబోయాడు తౌహీద్. టైమింగ్ మిస్ అయ్యాడు. గాల్లోకి లేచిన ఆ బంతిని హేజిల్‌వుడ్ అందుకున్నాడు. దీనితో 133 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది బంగ్లా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+