IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH!

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్(RR) జోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్రేక్ వేసింది. సోమవారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో అసాధారణ బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన ఆరెంజ్ ఆర్మీ 57 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్‌ను చిత్తు చేసింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి టేబుల్ టాపర్‌గా కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్‌కు హైదరాబాద్ టీమ్ గట్టి షాకిచ్చింది.

ఈ భారీ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడంతో పాటు నెట్ రన్‌రేట్ కూడా మెరుగైంది. ఈ టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది రెండో విజయం. అరంగేట్ర పేసర్లు ప్రఫుల్ హింగే, సకీబ్ హుస్సేన్ నాలుగేసి వికెట్లతో ‌సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సంచలన విజయాన్ని అందించారు.

నిప్పులు చెరిగిన ప్రఫుల్ హింగే, హుస్సేన్..

217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. డోనవన్ ఫెరీరా(44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 69), రవీంద్ర జడేజా(32 బంతుల్లో 5 ఫోర్లతో 45), తుషార్ దేశ్ పాండే(25) పోరాడినా ఫలితం లేకపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో అరంగేట్ర పేసర్లు ప్రఫుల్ హింగే(4/34), సకీబ్ హుస్సేన్(4/24) నాలుగేసి వికెట్లు తీయగా.. ఎషాన్ మలింగా(2/31) రెండు వికెట్లు పడగొట్టాడు

అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(44 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 91) తృటిలో శతకం చేజార్చుకోగా.. హెన్రీచ్ క్లాసెన్(26 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 40), నితీష్ కుమార్ రెడ్డి(13 బంతుల్లో 4 సిక్స్‌లతో 28), సలీల్ అరోరా(13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/37) రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, రియాన్ పరాగ్ తలో వికెట్ తీసారు.

How Vaibhav Sooryavanshi Golden Duck Triggered RR s Collapse and Sealed SRH s 57-Run Win in IPL 2026

కొంపముంచిన వైభవ్ సూర్యవంశీ..

జస్‌ప్రీత్ బుమ్రా.. కగిసో రబాడ, జోష్ హాజెల్ వుడ్, భువనేశ్వర్ కుమార్‌ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను చితక్కొట్టిన రాజస్థాన్ రాయల్స్ సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో మాత్రం గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ప్రఫుల్ హింగే వేసిన తొలి ఓవర్‌లో తాను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్‌కే వైభవ్.. భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన వైభవ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగడంతో రాజస్థాన్ బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు.

దాంతో వరుసగా వికెట్లు కోల్పోయారు. ప్రఫుల్ హింగే వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికి ధ్రువ్ జురెల్‌ క్లీన్ బౌల్డ్ కాగా.. ఆఖరి బంతికి ప్రిటోరియస్‌ను క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసిన ఫస్ట్ పేసర్‌గా ప్రఫుల్ హింగే చరిత్రకెక్కాడు. ప్రఫుల్ హింగే ధాటికి రాజస్థాన్ రాయల్స్ ఒక్క పరుగుకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ ఒక్క ఓవరే రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించింది. వైభవ్ సూర్యవంశీ ఈ ఓవర్ జాగ్రత్తగా ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

సకీబ్ హుస్సేన్ సైతం..

ఆ తర్వాత మరో అరంగేట్ర పేసర్ సకీబ్ హుస్సేన్(4/24) నాలుగు వికెట్లతో చెలరేగి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇద్దరూ అరంగేట్ర పేసర్ల అద్భుత ప్రదర్శనతో బలహీనంగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ యూనిట్‌ పటిష్టంగా మారింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 219 పరుగుల భారీ స్కోర్‌ను కాపాడుకోలేకపోయిన సన్‌రైజర్స్.. ఈ మ్యాచ్‌లో మాత్రం కళ్లు చెదిరే బౌలింగ్ ప్రదర్శన‌తో ఆకట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+