ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్, వరుణ్ జోరు.. హార్ధిక్ అగ్రస్థానం !
ICC T20 Rankings: ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్ లో భారత బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ, బౌలర్ల జాబితాలో వరుణ్ చక్రవర్తి తమ కెరీర్ లో అత్యుత్తమ రెండో స్థానాలను నిలబెట్టుకున్నారు. బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ రెండో స్థానంలో నిలవగా.. బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి రెండో స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా 252 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్ రౌండర్ల జాబితాలో నేపాల్ కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీ 233 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియాకు చెందిన మార్కస్ స్టొయినీస్ 210 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
టాప్-5లో సూర్య, తిలక్ వర్మ
బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో తిలక్ వర్మ, భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లు వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు. బ్యాట్స్‌మెన్ జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ 856 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 829 పాయింట్లతో అభిషేక్ శర్మ(భారత్) రెండో స్థానం, ఇంగ్లాండ్ కు చెందిన ఫిల్ సాల్ట్ 815 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. తిలక వర్మ(804), సూర్య కుమార్ యాదవ్(739) తర్వాత స్థానాల్లో ఉన్నారు.

బౌలింగ్ లో రెండో స్థానంలో వరుణ్ చక్రవర్తి
బౌలింగ్ జాబితాలో వెస్టిండీస్ కు చెందిన అకేల్ హుస్సేన్(707 పాయింట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 706 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ 705 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. శ్రీలంకకు చెందిన వానిందు హసరంగా(700 పాయింట్లు), ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్(694) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత ఆటగాడు రవి బిష్ణోయ్ 674 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా, ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 653 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications