ఆస్ట్రేలియా టార్గెట్ 162: కొంచెమే అయినా కొండంత: అప్పుడే 3 వికెట్లు ఢమాల్..!!
IND vs AUS: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న అయిదో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్‌లో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది. మూడో రోజు లంచ్ సమయానికి మూడు వికెట్లను నేలకూల్చిందిొ. బ్యాక్‌బోన్ వంటి బ్యాటర్లు పెవిలియన్ చేరారు.
సిరీస్‌ను సమం చేయాలంటే టీమిండియా గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఇది గెలిస్తేనే 2-2తో సమవుజ్జీగా నిలవగలుగుతుంది. అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కూ చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకోగలుగుతుంది. ఇలా అన్ని రకాలుగా అత్యంత కీలకంగా మారిందీ గేమ్ భారత్‌కు.

ఈ పరిస్థితుల్లో రెండో ఇన్నింగ్ తొలి సెషన్‌లో బౌలర్లు చెలరేగారు. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ వెన్ను విరిచారు. మూడో రోజు భోజన విరామ సమయానికి మూడు వికెట్లను నేల కూల్చగలిగారు. కీలకమైన బ్యాటర్లందరూ వెనుదిరిగారు. ఫలితంగా ఆస్ట్రేలియా తీవ్ర ఒత్తిడిలో పడింది. పరుగులు తీయడానికి అష్టకష్టాలు పడుతోంది.
ఈ మూడు వికెట్లు కూడా ప్రసిద్ధ్ కృష్ణ ఖాతాలో పడటం హైలైట్‌గా చెప్పుకోవచ్చు. అగ్రెసివ్‌గా ఆడుతోన్న డాషింగ్ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ అవుట్ అయ్యాడు. ధాటిగా ఆడుతున్న కొన్‌స్టాస్‌తో వికెట్ల వేట మొదలుపెట్టాడు ప్రసిద్ధ్ కృష్ణ. అతను సంధించిన గుడ్ లెంగ్త్ డెలివరీని మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు కొన్‌స్టాస్.
టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచిన ఆ బంతిని వాషింగ్టన్ సుందర్ అందుకోలిగాడు. అతని మెరుపు ఇన్నింగ్‌కు తెరపడింది. 17 బంతుల్లో మూడు బ్యాక్ అండ్ బ్యాక్ ఫోర్లతో 22 పరుగులు చేశాడు కొన్‌స్టాస్. 39 పరుగుల తొలి వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా.
52 పరుగుల వద్ద రెండో వికెట్ పడింది. ఈ సారి మార్నుస్ లాబుషేన్ అవుట్ అయ్యాడు. ఆఫ్ స్టంప్‌కు కాస్త దూరంగా ప్రసిద్ధ్ కృష్ణ వేసిన లెంగ్తీ డెలివరీని ఆడబోయి టైమింగ్ మిస్ అయ్యాడు లాబషేన్. ఎడ్జ్ తీసుకుని గల్లీ వైపు దూసుకెళ్లిన బంతిని అక్కడే పొంచివున్న యశస్వి జైస్వాల్ షార్ప్‌గా అందుకున్నాడు. లాబుషేన్ చేసింది ఆరు పరుగులే.
ఆ వెంటనే మరో వికెట్ డౌన్ అయింది. జట్టు స్కోరు 58 పరుగుల వద్ద స్టీవెన్ స్మిత్ వెనుదిరిగాడు. ఈ వికెట్ కూడా ప్రసిద్ధ్ కృష్ణ ఖాతాలోనే పడింది. షార్ట్ ఆఫ్ సైడ్ ఆఫ్ డెలివరీని డిఫెన్స్ ఆడబోయినా ఉపయోగం లేకుండా పోయిందతనికి. అనూహ్యంగా బౌన్స్ అయిన ఆ డెలివరీ టాప్ ఎడ్జ్‌ను తీసుకుని జైస్వాల్ వైపు దూసుకెళ్లింది. ఈ లో-క్యాచ్‌ను మిస్ చేయలేదతను. ఈ టెస్ట్ గెలవాలంటే ఇంకా 91 పరుగులు చేయాల్సి ఉంది ఆస్ట్రేలియాకు. క్రీజ్‌లో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్ ఉన్నారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications