Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆస్ట్రేలియా సగానికి హాంఫట్: హైలైట్ డెలివరీ

IND vs AUS: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న అయిదో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్‌లో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది. రెండో రోజు లంచ్ సమయానికి సగం మంది ప్లేయర్లు అవుట్ అయ్యారు. పెవిలియన్ చేరుకున్నారు.

సిరీస్‌ను సమం చేయాలంటే టీమిండియా గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఇది గెలిస్తేనే 2-2తో సమవుజ్జీగా నిలవగలుగుతుంది. అటు వరల్డ్ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కూ చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకోగలుగుతుంది. ఇలా అన్ని రకాలుగా అత్యంత కీలకంగా మారిందీ గేమ్ భారత్‌కు.

IND vs AUS Australia lost 5 for 96 at Lunch in Sydney test against India as Bumrah and Siraj shines

ఈ పరిస్థితుల్లో తొలి ఇన్నింగ్‌లో భారత బౌలర్లు చెలరేగారు. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ వెన్ను విరిచారు. రెండో రోజు భోజన విరామ సమయానికి అయిదు వికెట్లను నేల కూల్చగలిగారు. కీలకమైన బ్యాటర్లందరూ వెనుదిరిగారు. ఫలితంగా ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆస్ట్రేలియా ఓ మోస్తరు స్కోరును కూడా చేయలేకపోతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

తొలి రోజు ఇన్నింగ్ చిట్టచివరి బంతికి ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను కేప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా బలిగొన్ని విషయం తెలిసిందే. రెండో రోజూ వికెట్ల పతనం కొనసాగింది. జట్టు స్కోరు 15 పరుగుల వద్ద వన్ డౌన్ బ్యాటర్ మార్నుస్ లాబుషేన్ అవుట్ అయ్యాడు. బుమ్రా వేసిన గుడ్ లెంగ్త్ బంతిని డిఫెన్స్ ఆడబోయి అవుట్ అయ్యాడు లాబుషేన్. ఎడ్జ్ తాకుతూ వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేతుల్లో వాలిందా డెలివరీ. రివ్యూకు వెళ్లినా ఉపయోగం లేకుండాపోయింది. అతను చేసిన పరుగులు రెండే.

జట్టు స్కోరు 35 పరుగుల వద్ద ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ అవుట్ అయ్యాడు. సిరాజ్ వేసిన అవుట్ స్వింగర్‌ను స్ట్రెయిట్ డ్రైవ్ ఆడబోయాడు కొన్‌స్టాస్. ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి గల్లీ వైపు గాల్లోకి ఎగిరింది. అక్కడే పొంచివున్న యశస్వి జైస్వాల్.. దీన్ని అద్భుతంగా అందుకోగలిగాడు.

అతని స్థానంలో వచ్చిన ట్రావిస్ హెడ్ కూడా వెంటనే అవుట్ కావడంతో 39 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది ఆసీస్. స్టీవెన్ స్మిత్, కొత్త ప్లేయర్ బ్యు వెబ్‌స్టర్.. కొంతమేర బౌలర్లను ప్రతిఘటించగలిగారు. ఈ క్రమంలో ఆరో వికెట్ భాగస్వామ్యానికి 57 పరుగులను జోడించగలిగారు. 96 పరుగుల వద్ద స్మిత్ అవుట్ అయ్యాడు. లంచ్ సమయానికి అయిదు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది ఆసీస్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+