టీమిండియాకు బిగ్ బ్లో: రోహిత్‌ను గాయపరిచిన దయా
Rohit Sharma injury: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 26వ తేదీన నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కాబోతోంది. బాక్సింగ్ డే టెస్ట్ ఇది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ దీనికి వేదిక. ఈ కీలక మ్యాచ్ కోసం రెండు జట్లు ముమ్మరంగా కసరత్తు సాగిస్తోన్నాయి. నెట్ ప్రాక్టీస్ చేస్తోన్నాయి.
ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య మూడు టెస్ట్ మ్యాచ్‌లు జరగ్గా.. 1-1తో సమంగా నిలిచాయి. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ సిరీస్ గెలవాలన్నా, డ్రాగా ముగించుకోవాలనుకున్నా బాక్సింగ్ డే గేమ్ అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో దీన్ని ప్రతిష్ఠాత్మంగా తీసుకున్నాయి రెండు జట్లు.

ఈ పరిస్థితుల్లో భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. కేప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్ మెంబర్, థ్రో- డౌన్ స్పెషలిస్ట్ దయా విసిరిన బంతిని ఆడటంలో విఫలం అయ్యాడు రోహిత్ శర్మ. బుల్లెట్‌లా దూసుకొచ్చిన ఆ బంతి నేరుగా అతని ఎడమ మోకాలిని తాకింది.
దీనితో నొప్పితో విలవిల్లాడాడు రోహిత్ శర్మ. అక్కడే కూర్చుండిపోయాడు. చాలా డిస్‌కంఫర్ట్‌గా కనిపించాడతను ఆ సమయంలో. వెంటనే ఫిజియోథెరపిస్ట్‌ను పిలిపించాడు. పెయిన్ కిల్లర్ తీసుకున్నాడు. నొప్పి తెలియకుండా ఉండటానికి కొద్దిసేపు ఐస్ ప్యాక్‌ను మోకాలిపై ఉంచుకున్నాడు. నెట్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నాడు.
ఫామ్‌ను కోల్పోయాడు రోహిత్ శర్మ. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ భారీ స్కోర్ చేయలేకపోయాడు. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్ట్‌లో ఆడలేదు. దానికి జస్‌ప్రీత్ బుమ్రా కేప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్ గెలుచుకుంది టీమిండియా. రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్‌లో 3, మలి ఇన్నింగ్‌లో 6 పరుగులతో సరిపెట్టుకున్నాడు రోహిత్ శర్మ.
ఆ మ్యాచ్‌ను 10 వికెట్ల తేడాతో కోల్పోవాల్సి వచ్చింది. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్‌లో అతను చేసింది 10 పరుగులే. ఈ పరిస్థితుల్లో నాలుగో టెస్ట్ మ్యాచ్‌లోనైనా రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు రోహిత్ శర్మ. నెట్ ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతున్నాడు. ఈ క్రమంలో గాయపడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications